seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 4:17 pm Digital Edition : SEEMA KIRANAM

“ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ కు అండగా భారత్” | knesset PMModi in: టెర్రర్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌తో భారత్ దృఢంగా నిలుస్తుంది – పూర్తి మద్దతు ప్రకటించింది!

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్‌కు 1.4 బిలియన్ల (140 కోట్లు) భారత ప్రజల తరపున శుభాకాంక్షలను తెలియజేశారు. భారత్- ఇజ్రాయెల్ రెండు పురాతన నాగరికతల కలయికగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత్, ఇజ్రాయెల్ రెండు వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి కలిగిన దేశాలని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక ఆసక్తికరమైన పరిశీలన ఇజ్రాయెల్ పార్లమెంటులో పంచుకున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని భారతదేశం అధికారికంగా గుర్తించిన రోజునే (సెప్టెంబర్ 17, 1950) తాను జన్మించానని.. ఇది ఒక ప్రత్యేకమైన అనుబంధమని ఆయన పేర్కొన్నారు. దాంతో అందరూ చప్పట్లతో స్వాగతించారు.

అలాగే అక్టోబర్ 7 న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. హమాస్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 140 కోట్ల భారతీయుల తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ పూర్తి విశ్వాసంతో, సంపూర్ణ మద్దతుతో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన “గాజా శాంతి ఒప్పందానికి భారత్ తన పూర్తి మద్దతును ప్రకటించింది.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్‌తో సైనిక గౌరవ వందనం సమర్పించింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్ కు మోదీ చేరుకున్నారు. ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టగానే సభ మొత్తం నిల్చుని మోదీకి చప్పట్లతో ఆహ్వానం పలికింది. సభలోని సభ్యులంతా నిల్చుని ప్రధాని మోదీ.. మోదీ.. అంటూ చప్పట్లతో ఆహ్వానించారు. దాంతో సభ్యులందరికీ నమస్కారం చేస్తూ ప్రధాని మోదీ తనకు కేటాయించిన సీటులో ఆసీనులయ్యారు.

అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒహానా ప్రసంగిస్తూ.. వెల్ కమ్ టూ నెస్సెట్, ప్రధాని నరేంద్ర మోదీ.. అని హిందీలో చెప్పారు. దాంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఇక ఈ సమావేశంలో తొలుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రధాని మోదీ కేవలం స్నేహితుడు మాత్రమే కాదు.. సోదరుడితో సమానం అని అన్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న అత్యున్నత స్థాయి దౌత్య, వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది. ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి నాయకుడని ప్రశంసించారు నెతన్యాహు.

టెర్రర్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌తో భారత్‌లో నెస్సెట్ పిఎం మోడీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు

గత కొన్నేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఎక్కువగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. రక్షణ, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మూడు రెట్లు పెరిగిందని. టెల్ అవివ్ లోని వెంటనే విమానాశ్రయంలో ప్రధాని మోదీ దిగిన తాను, తన భార్య సారా ఆయనకు స్వాగతం పలికామని నెతన్యాహు అన్నారు. ఇక 150 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ ఒక గిగాంటిక్ పవర్ అని ఆయన అభివర్ణించారు.

Source link