ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాదికి ముందు నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుంది. మార్చి 17వ తేదీన తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 2064 టిడ్కో ఇళ్లకు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 168 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గృహ సముదాయం వందలాది కుటుంబాలకు గూడు ఏర్పాటు చేయనుంది.
బిరదవాడ సమీపంలో టిడ్కో ఇళ్లకు గృహ ప్రవేశాలు
జాతీయ రహదారి 16కు ఆనుకొని, నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని బిరదవాడ సమీపంలో ఈ ఇళ్ళు నిర్మాణం అయ్యాయి. ఉగాది పండుగను పురస్కరించుకొని గృహప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఈ సౌకర్యాలు అన్ని సౌకర్యాలతో, నివాస యోగ్యంగా ఉండేలా ఈ ఇళ్లను సిద్ధం చేశారు అధికారులు.

టిడ్కో ఇళ్ళు పూర్తి చేయటంపై ప్రభుత్వం దృష్టి
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాయుడుపేటలో 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ నిర్మాణాలు మొదలయ్యాయి. దాదాపు 70 శాతం పనులు, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంతృప్తిగా వదిలివేసిన టిడ్కో ఇళ్లపై దృష్టిసారించి పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది.
ఇళ్ల పంపిణీతో వేలాదిమంది జీవితాలలో సంతోషం
ఇప్పుడు సకల సౌకర్యాలతో నివాస యోగ్యంగా టిడ్కో ఇళ్ళు మారాయి. ప్రజలకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లను పూర్తిచేసి గృహప్రవేశాలు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు గృహప్రవేశాలు సిద్ధమయ్యాయి. ఈ ఇళ్ల పంపిణీతో వేలాదిమంది జీవితాలలో సంతోషాన్ని నింపుతుంది కూటమి సర్కార్.
నిరుపేదల సొంతింటి కల నిజం చేసేచర్యలు
వారంతా ఎంతోకాలంగా సొంతింటి కలను కంటూ, ఆ కల నెరవేరక నిరాశ, నిస్పృహలతో ఉన్నవేళ కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయిస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తున్న కూటమి సర్కార్, నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడం కోసం తీసుకుంటున్న చర్యలను వారు ప్రశంసిస్తున్నారు.
ఉగాది పండుగకు చంద్రబాబు నిరుపేదలకు ఇచ్చిన బహుమతి
తెలుగువారి సంవత్సరాది, కొత్త ఏడాది ప్రారంభానికి ముందే నిరుపేదలైన కుటుంబాలు తమ సొంత ఇంటి గడప తొక్కబోతుండడం వారి సంతోషానికి కారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది పండుగకు చంద్రబాబు నిరుపేదలకు ఇచ్చిన బహుమతి ఇదని స్థానికంగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు ఇస్తున్న ఈ ఉగాది కానుక పండుగ వాతావరణాన్ని మరింత పెంచి, లబ్ధిదారుల జీవితాల్లో కొత్త ఆశలు, వెలుగులు నింపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంగ్ల సారాంశం
ఉగాదికి ముందే పేదలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. మార్చి 17న నాయుడుపేటలో ఇళ్లులేని పేదలకు 2064 టిడ్కో ఇళ్లతో కానుకగా ఇస్తున్న చంద్రబాబు.