అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు. అనంతరం ట్రంప్ ఈ మేరకు ఇరాన్ కు వార్నింగ్ ఇస్తూ తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో కీలక పోస్టు పెట్టారు. ఇరాన్ మధ్య ప్రాచ్యంలో ఓడిపోయిన దేశంగా ట్రంప్ అభివర్ణించారు. ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం సందర్భంగా పొరుగు దేశాలపై జరిగిన దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈలపై శనివారం ఉదయం జరిగిన వరుస దాడుల అనంతరం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఆయా దేశాలపై దాడులు చేసే ఉద్దేశం లేదు. వారు దాడి చేయకపోతే ఇరాన్ కూడా చేయదని స్పష్టం చేశారు. ఈ మేరకు గల్ఫ్ దేశాలపై దాడులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పెజెష్కియాన్ ప్రకటనపై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఇలా అన్నారు.. “ఘోరంగా దెబ్బతిన్న ఇరాన్ తన మధ్యప్రాచ్య పొరుగు వారికి క్షమాపణ చెప్పి లొంగిపోయింది. ఇకపై వారిపై కాల్పులు జరపబోమని హామీ ఇచ్చింది. ఈ హామీ అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా వారు మధ్య ప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. వేల సంవత్సరాల చరిత్రలో మధ్యప్రాచ్య దేశాల పట్ల ఇరాన్‌కి ధన్యవాదాలు!’ అని చెప్పాను.”

“ఈరోజు ఇరాన్‌కు చాలా గట్టి దెబ్బ తగులుతుంది! ఇరాన్ ప్రవర్తన కారణంగా, ఈ క్షణం వరకు ముఖ్యమైన ప్రాంతాలు, ప్రజల సమూహాలను పూర్తిగా నాశనం చేసి, ఖచ్చితమైన మరణానికి గురిచేయాలని తీవ్రంగా చూస్తున్నాము” అని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తాజా వార్నింగ్ తో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

