Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఈ నెల 7న ఎమ్మిగనూరుకు ముఖ్యమంత్రి రాక

ఈ నెల 7న ఎమ్మిగనూరుకు ముఖ్యమంత్రి రాక

📰 Generate e-Paper Clip

ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

 

రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ

 

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

 

కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్):

ఫిబ్రవరి 7వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. సోమవారం కలుగొట్ల గ్రామంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ , జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , ఎమ్మెల్యే డా. జయ నాగేశ్వర రెడ్డి , ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ , అలాగే సంబంధిత శాఖల అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, ప్రజా వేదిక, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ… ఫిబ్రవరి 7వ తేదీన కలుగొట్ల గ్రామంలో నిర్వహించనున్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా వేదిక కార్యక్రమం, రైతుల పొలాల పరిశీలన, తదితర కార్యక్రమాలు జరగనున్నాయని, కార్యక్రమాలన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ , జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ , డిఎంహెచ్వో భాస్కర్ , ఆర్ అండ్ బి ఎస్. ఇ. మహేశ్వర్ రెడ్డి , డి పి ఓ భాస్కర్ , డిఎస్ఓ రాజా రఘువీర్ , ఏ డీ సర్వే మణికన్నన్ , జేడీ అగ్రికల్చర్ వరలక్ష్మి , తహసీల్దార్ శ్రీనివాసులు , మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular