కర్నూలు నగరంలో ఈ నెల 17న పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 14 (సీమకిరణం న్యూస్):
నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 17వ తేదీన తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అశోక్‌నగర్ వద్ద ఉన్న 42.70 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటరమణ కాలనీ, బాలాజీనగర్, మమతానగర్, ఏ.క్యాంపు, జోహరాపురం, గణేష్‌నగర్, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, జంపాల అపార్ట్‌మెంట్ లైన్, పార్వతీ అపార్ట్‌మెంట్ లైన్, టీచర్స్ కాలనీ, మధర్‌ల్యాండ్ లైన్, సాయి వైభవ్ కాలనీ, లక్ష్మీ టౌన్‌షిప్, సోమిశెట్టి నగర్, హోసన్నా మండి లైన్, రామ్‌నగర్, చంద్రశేఖర్ నగర్, ఆంజనేయస్వామి టెంపుల్ లైన్, వెంకటాద్రి నగర్, జయరాం నగర్, శేషాద్రి నగర్, ధనలక్ష్మి నగర్, బృందావన్ నగర్, సనత్ నగర్, పోస్టల్ కాలనీ, వాసవి నగర్, బి.టి.ఆర్. నగర్, టెలికాం నగర్, సిండికేట్ బ్యాంక్ కాలనీ, విజయపురి కాలనీ, ఎన్‌జీఓ కాలనీ, మౌలాలి మోగా సిటీ, అరవింద నగర్, కళావతి నగర్, శారద నగర్, చిన్న సుంకన్న కాలనీ, రామకృష్ణ నగర్, ఉద్యోగ నగర్, రామచంద్ర నగర్, వివేక్ నగర్, గీతా నగర్, గోపీ నగర్, ఎల్.వెంకయ్య నగర్, గురుద్వారా నగర్, సంపత్ నగర్, డిమార్ట్ బ్యాక్‌సైడ్ లైన్, గోవర్ధన్ నగర్, గంగావతి నగర్, పోలీస్ కాలనీ, ముజఫర్ నగర్, ఎంవంతమ్మ నగర్, మాదిరాజు నగర్, భరత్ నగర్, ఉమాశంకర్ నగర్, ఉమామహేశ్వరి నగర్, శశిర్ నగర్, సవారి టౌన్, మంగళగిరి, గట్టయ్య నగర్, పద్మావతి నగర్, వెంకటేష్ నగర్ తదితర ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ముందుగానే అవసరమైనంత నీటిని నిల్వ చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.