Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగలు అరెస్ట్

ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగలు అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగలు అరెస్ట్

 

హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు నిందితుల నుండి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

 

కర్నూలు క్రైమ్, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు పట్టణంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేటువంటి మద్దిలేటి అను అతని ఇంటిలో జనవరి 29న పగలు సుమారు 12 గంటల ప్రాంతంలో ఇంటికన్నం దొంగతనం జరిగింది. అందులో సుమారు 13 తులాల బంగారు ఆభరణాలని దొంగతనం చేసి ఇంట్లో నుండి బయటికి వచ్చే క్రమంలో గమనించి అడ్డొచ్చిన మద్దిలేటి భార్య లక్ష్మీదేవి, ఆమె కూతురిని గట్టిగా నెట్టేసి మోటార్ సైకిల్ లో పారిపోయినట్టు వచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకొని ఫిర్యాది భార్యకి గాయమైనదని, ఎట్టి పరిస్థితులలో కేసును చేధిoచాలనీ, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 4 టౌన్ ఇన్స్పెక్టర్ విక్రమ సింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ మురళీధర్ మరియు లక్ష్మీనారాయణ ప్రత్యేక బృందంగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్ లను కర్నూలు నుంచి షాద్ నగర్ వరకు క్షుణ్ణంగా పరిశీలించి, ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సదురు సమాచారాన్ని పంచుకొని దొంగతనానికి పాల్పడిన నిందితులు మారెడ్ పల్లి నివాసి అయినా రఘు మరియు సికింద్రాబాద్ నివాసి అయినా టమాటార్ శివా సింగ్ గా గుర్తించి వారి యొక్క కదలకలపై నిఘా ఉంచి గురువారం మునగాల పాడు గ్రామ శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపాన గల బంజారా హిల్స్ వెంచర్ నందు ఉదయం సుమారు 9 గంటలకు వారిద్దరిని అరెస్టు చేసి వారి నుండి దొంగతనం చేసిన సుమారు 7 తులాల బంగారు ఆభరణాలను, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ యన్ టార్క్ మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ముద్దాయి అయినటువంటి సికింద్రాబాద్కు చెందిన టమటర్ శివా సింగ్ పైన గోపాలపురం పోలీస్ స్టేషన్, తుకారాం గేట్, చిలకలగూడ, మేడిపల్లి, హయత్ నగర్, అంబర్పేట ఘట్కేసర్, జవహర్ నగర్ గాంధీనగర్, బాలనగర్ మారేడ్పల్లి సుల్తాన్ బజార్ పేట్ బషీర్బాగ్ మొదలగు పోలీస్ స్టేషన్లో 28 కి పైగా అతని మీద ఇంటికన్నపు దొంగతనాల కేసులు కలవు.  అదేవిధంగా మరొక నిందితుడైన బిజినమైన రఘు పైన 15 కు పైగా దొంగతం కేసులు కలవు. 2021 వ సంవత్సరం లో శివా సింగ్ ఓనా సంవత్సరం పాటు పీడీ యాక్ట్ పై చంచల గూడ జైలు నందు ఖైదు చేయబడ్డాడు. కర్నూల్ నాలుగో పట్టణ సిఐ విక్రమ సింహ మాట్లాడుతూ బంగారు ధరలు పెరుగుతున్న దృష్ట్యా మరింత జాగ్రత్తగా ఉండాలని , దయచేసి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్ లలో భద్ర పరచుకోవాలని కర్నూల్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular