Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇళ్లంతా నోట్ల గుట్టలే.. రాష్ట్రంలోనే బాహుబలి తిమింగలం.. | ఒడిశా విజిలెన్స్ రైడ్: రూ. ప్రభుత్వ...

ఇళ్లంతా నోట్ల గుట్టలే.. రాష్ట్రంలోనే బాహుబలి తిమింగలం.. | ఒడిశా విజిలెన్స్ రైడ్: రూ. ప్రభుత్వ అధికారి దేబబ్రత మొహంతి నివాసం నుంచి 4 కోట్ల నగదు స్వాధీనం

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

ఒడిశాలో భారీ అవినీతి తిమింగలం బయట పడింది. ఒడిశా విజిలెన్స్ డిపార్ట్ మెంట్ జరిపిన రైడ్స్ లో ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా నగదును సీజ్ చేశారు. దాదాపు రూ. 4 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్ర చరిత్రలోనే ఓ అధికారి నుంచి ఇంత పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేయడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రూ. 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో కోట్ల రూపాయల సొమ్ము బయటపడినట్లు అధికారులు గుర్తించారు.

ఒడిశాలోని కటక్ సర్కిల్‌లో దేబవ్రత మోహంతీ అనే ప్రభుత్వ ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఓ లైసెన్స్ డ్ బొగ్గు ట్రేడర్ నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. విజిలెన్స్ అధికారులు అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అయితే భువనేశ్వర్, పటియాలోని దేబవ్రత మోహంతీ కి చెందిన ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో అతడి ఇంట్లో భారీగా డబ్బు, బంగారం బయటపడింది. ఈ లెక్కల్లో చూపని రూ. 4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కటక్‌లో ఉన్న ఆయన కార్యలయంలోని ఓ టేబుల్‌లో మరో లక్ష 20వేల రూపాయల నగదును పేర్కొన్నారు. అతనితో పాటు అతని రెండంతస్తుల భవనంలో 130 గ్రాముల బంగారాన్ని కూడా గుర్తించినట్లు విజిలెన్స్ సమూహంగా ఉంది.

ఒడిశా విజిలెన్స్‌ దాడిలో ప్రభుత్వ అధికారి దేబబ్రత మహంతి నివాసంలో రూ.4 కోట్ల నగదు స్వాధీనం

ఈ ఘటనపై విజిలెన్స్ డైరెక్టర్ యశ్వంత్ జెత్వా మీడియాతో మాట్లాడారు. ఇది సాధారణ లంచం కేసుగానే ముందుగా భావించామని అన్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుందని ఊహించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకటం ఇదే మొదటి సారని జెత్వా అన్నారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular