Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇల్లరికం తెచ్చుకున్న అత్తపై హత్యాచారం చేసిన అల్లుడు.. దారుణ ఘటన | నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్తపై...

ఇల్లరికం తెచ్చుకున్న అత్తపై హత్యాచారం చేసిన అల్లుడు.. దారుణ ఘటన | నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్తపై అల్లుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

రోజుకి సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎవరిని ఏ విధంగా హింసిస్తారు అనేది తెలియకుండా పోతుంది. వావి వరసలు మరిచి పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. తాజాగా సభ్య సమాజం నివ్వెరపోయే ఒక ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.

అత్తపై అల్లుడి అత్యాచారం, ఆపై హత్య

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇల్లరికం తెచ్చుకున్న అత్త పైన అల్లుడు హత్యాచారం చేసిన ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక ఈ ఘటనల్లోకి వెళితే కన్నబిడ్డను పెళ్లి కాకుండా ఇల్లరికం తెచ్చుకొని పెంచి పోషిస్తున్న అత్త పైనే ఓ అల్లుడు అత్యాచారం చేసి ఆమెను హతమార్చిన ఘటన చోటు చేసుకుంది.

నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్తపై అల్లుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్న అత్త

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో కల్వకుర్తి సీఐ నాగార్జున వివరాల ప్రకారం కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఒక మహిళ తన కుమార్తెకు కొన్నాళ్ల క్రితం తిమ్మాజీపేటకు చెందిన మరో వ్యక్తికి పెళ్లి చేసింది. అల్లుడు తాగుడుకు బానిస కాగా కుమార్తెను వేధింపులకు గురి చేయడంతో, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది.

ఇల్లరికం తెచ్చుకోవడమే ఆమె పాలిట శాపం

తన దగ్గర ఉంటే కనీసం మారతాడని, వారిద్దరినీ పోషించగలుగుతున్నాను అని భావించిన అత్త ఇల్లరికం తెచ్చుకోవడమే ఆమె పాలిట శాపమైంది. ఇటీవల భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడు అత్తపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను కొట్టి చంపాడు. ఇక సోమవారం రోజు ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మానవ సంబంధాలపై ఆలోచించేలా చేస్తున్న ఘటన

మృతురాలి రెండో కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆపై పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడమే కాకుండా ఇల్లరికం కూడా తెచ్చుకొని తిండిపెట్టి పోషిస్తున్న అత్తపైన అత్యాచారం చేసిన అల్లుడు చివరకు ఆమెను హతమార్చి చేసిన ఘాతకం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇది ప్రతి ఒక్కరిని మానవ సంబంధాలపైన, మానవతా విలువలపైన ఆలోచించేలా చేస్తుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular