అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లుగా. అమెరికా- ఇరాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలో ఆయన హతమైనట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేయబడింది. ఖమేనీని అత్యంత దుర్మార్గుడైన నాయకుడిగా అభివర్ణించారు ట్రంప్.
“చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన ఖమేనీ మరణించాడు. ఇది ఇరాన్ ప్రజలకే కాదు, ఖమేనీ వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ప్రపంచదేశాలు, ప్రజలకు న్యాయం జరిగింది..” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్ హౌస్ కూడా దీన్ని నిర్ధారించింది. ఇదే ట్వీట్ చేసింది. తమ దేశాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇరాన్ ప్రజలకు గొప్ప అవకాశం లభించిందని ట్రంప్ చెప్పారు. ఖమేనీ మరణించిన తర్వాత కూడా ఈ సైనిక చర్యలు కొనసాగుతున్నాయని తేల్చి చెప్పారు.

ట్రంప్ ప్రకారం, ఖమేనీ తమ “తెలివైన ట్రాకింగ్ వ్యవస్థల” నుండి తప్పించుకోలేకపోయారు. ఇజ్రాయెల్‌తో “సన్నిహితంగా పనిచేస్తూ” ఈ ఆపరేషన్ జరిగింది, ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హతమయ్య. రెవల్యూషనరీ గార్డ్, భద్రతా బలగాలు ఇప్పుడు రోగనిరోధక శక్తి కోసం చూస్తున్నాయని హెచ్చరిస్తూ, “ఇప్పుడు వారికి రోగనిరోధక శక్తి లభిస్తుంది, తరువాత వారికి మరణం మాత్రమే!” అని ఆయన స్పష్టం చేశారు.
ఆంగ్ల సారాంశం
ఇరాన్‌పై యుఎస్-ఇజ్రాయెల్ దాడులు మరియు సంకేతాలు కొనసాగుతున్న సమ్మెల తర్వాత ఖమేనీ మరణించినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు