అంతర్జాతీయ
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) కలిసి చేస్తున్నదాడులు (iran war) మూడో వారానికి చేరుకున్నాయి. ఇరాన్ లో నాయకత్వ మార్పు టార్గెట్ గా చేపట్టిన ఈ దాడులు ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ముఖ్యంగా ఈ చమురు క్షేత్రాలకు విస్తరించడం, ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడటం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఇవాళ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెట్ కీలక ప్రకటన చేశారు.
పెంటగాన్‌లో ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ అమెరికా మంత్రి రక్షణ పీట్ హెగ్సేత్.(pete hegseth). ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. గత వారం ఇరాక్‌లో మరణించిన ఆరుగురు అమెరికా సైనికుల కుటుంబాలతో తాను మాట్లాడానని, వారు పని పూర్తయ్యే వరకు ఆగమని తనను కోరారని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారని ఆయన తెలిపారు. అయితే ఇరాన్‌తో సంఘర్షణ శాశ్వత యుద్ధం కాదని ఆయన తేల్చేశారు. ఇది ఇరాక్ యుద్దం తరహాలో సుదీర్ఘంగా సాగబోదని తేల్చిచెప్పారు.

తమ ఇంధన మౌలిక సదుపాయాలపై మళ్లీ దాడి జరిగితే, గల్ఫ్ చమురు, గ్యాస్ సౌకర్యాలు పూర్తిగా నాశనమవుతాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇవాళ హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా సౌదీ అరామ్ కో, యూఏఈ టెర్మినల్స్, ఖతార్‌లో మిగిలి ఉన్న ఎల్‌ఎన్‌జి ట్రైన్‌లతో సహా ప్రతి గల్ఫ్ ఇంధన ఆస్తినీ ఇప్పుడు ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి ప్రకటన వెలువడింది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ తమ దేశంలో సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై జరిపిన దాడికి ప్రతిగా ఇవాళ గల్ఫ్ దేశాల్లో తీవ్రదాదులకు దిగుతున్న ఇరాన్ ను ఎలా నియంత్రించాలో తెలియని పరిస్ధితుల్లో ఉన్న అమెరికా .. యుద్ధాన్ని త్వరలో ముగిస్తున్నట్లు ప్రకటన చర్చనీయాంశంవుతోంది.