seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 1:54 am Digital Edition : SEEMA KIRANAM

ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్బల వేళ ట్రంప్ సంకేతం..! | డోనాల్డ్ ట్రంప్: “మేము ఈ రోజు ఇరాన్‌ను విడిచిపెట్టవచ్చు, పునర్నిర్మాణానికి 10 సంవత్సరాలు పడుతుంది”

అంతర్జాతీయ

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్ (iran)పై ఇజ్రాయెల్ తో కలిసి ఏకపక్షంగా యుద్ధం ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) కు ఇప్పుడు ఈ వార్ నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. దీనితో యుద్ధం ఎన్నిరోజులు కొనసాగుతుందనే దానిపై రోజుకో ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ యుద్దం త్వరలోనే ముగిస్తామని, మరోసారి చాలా రోజులు పడుతుందని ఇలా గందరగోళ ప్రకటనలు చేస్తున్న ట్రంప్ తాజాగా మరోసారి యుద్దం ముగింపుపై సంకేతాలు ఇచ్చారు.

ఇరాన్ యుద్ధంపై తాజాగా వైట్ హౌస్ లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో అన్నట్లు, మనం ఈరోజే వెళ్ళిపోతే, జరిగిన నష్టాన్ని పునర్నిర్మించడానికి 10 సంవత్సరాలు పడుతుందని ట్రంప్ సాధ్యం. కానీ మరే ఇతర అధ్యక్షుడూ ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి రాకుండా మనం దీనిని మరింత శాశ్వతం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ సమస్య మళ్ళీ మనకు ఎప్పటికీ రాకూడదన్నారు. ఇరాన్ నుంచి తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చారు.

ట్రంప్ మేము ఈ రోజు ఇరాన్‌ను విడిచిపెట్టవచ్చు, పునర్నిర్మాణానికి 10 సంవత్సరాలు పడుతుంది

అలాగే వార్ తీవ్రత ఎక్కువగా కనిపించడం, ఇరాన్ నుంచి నిష్క్రమణ తక్షణమే జరగదని ట్రంప్ స్పష్టం చేశారు. తాము ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా లేమన్నారు. కానీ అతి త్వరలో వెళ్ళిపోతామంటూ మరోసారి గందరగోళ వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘర్షణ దేశీయ ప్రాధాన్యతల నుండి తాత్కాలిక మళ్లింపు మాత్రమేనని ఆయన అన్నారు. దీనిని ఆయన చిన్న విహారయాత్ర అని అందిస్తూ రెండు వారాలు ఉంటాయని, ఎక్కువ కాలం ఉండదని. యుద్ధంపై ఆయన ఎంత గందరగోళంలో ఉన్నారో మరోసారి బయటపెట్టారు.

Source link