అంతర్జాతీయ
-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->ఇజ్రాయెల్ (ఇజ్రాయెల్)ఒత్తిడితో ఇరాన్ (iran)పై ఏకపక్షంగా దాడి ప్రారంభించిన అమెరికా (US)కు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వస్తోంది. యుద్ధం ప్రారంభమై మూడు వారాలు కావస్తుండటం, ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్ధితి మధ్య ఇరాన్‌లో పెద్దలందరినీ చంపేశామని, యుద్దం ముగుస్తుందని రోజూ ప్రకటనలు చేయడం తప్ప ఏమీ చేయలేని దుస్దితి ట్రంప్ (డోనాల్డ్ ట్రంప్)కు ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (NCTC) డైరెక్టర్ జో కెంట్ (joe kent) ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. వైట్‌హౌస్‌తో తీవ్ర విభేదాల మధ్య ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధానికి నిరసనగానే ఈ చర్య చేపట్టారు. ట్రంప్ పరిపాలనలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన మొట్టమొదటి, అత్యున్నత స్థాయి అధికారి ఈయనే. తాను ఇరాన్ యుద్ధానికి ఇకపై మద్దతు ఇవ్వలేనని కెంట్ ఎక్స్ లో పోస్టు చేశారు.

ఎక్స్ లో పెట్టిన పోస్టులో కెంట్.. చాలాకాలంగా ఆలోచించిన తరువాత, జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇరాన్ యుద్ధానికి తాను మనస్సాక్షిగా మద్దతు ఇవ్వలేనన్నారు. ఇరాన్ అమెరికాకు ఎటువంటి తక్షణ ముప్పును కలిగించలేదని, ఇజ్రాయెల్, దాని శక్తివంతమైన అమెరికన్ లాబీ ఒత్తిడి కారణంగానే తమ దేశం ఈ యుద్ధాన్ని ప్రారంభించిందని ఆయన తేల్చేశారు. బెరెట్స్ మాజీ సభ్యుడు, పలు యుద్ధాల్లో పాల్గొన్న కెంట్.. ట్రంప్‌కు రాసిన తన రాజీనామా లేఖను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ లేఖలో ఈ ప్రభుత్వం ప్రారంభంలోనే, ఉన్నత స్థాయి వ్యక్తులు ఇజ్రాయెల్ అధికారులు, అమెరికన్ మీడియాలో ప్రభావవంతమైన సమాచార ప్రసారాన్ని విస్తృతంగా అమలు చేసారు, ఇది మీ ‘అమెరికా ఫస్ట్’ పూర్తిగా బలహీనపరిచి, ఇరాన్‌తో యుద్ధం చేయాలనే అనుకూల భావనలను వ్యాప్తి చేసింది. ఈ తప్పుడు ప్రచారం మిమ్మల్ని తప్పుదోవ పట్టించి, ఇరాన్ అమెరికాకు తక్షణ ముప్పుగా ఉందని, ఇప్పుడు దాడి చేస్తే వెంటనే విజయం సాధించవచ్చని నమ్మించిందని, ఇది అబద్ధమని చెప్పారు. వేలాది మంది సైనికుల ప్రాణాలను బలిగొన్న వినాశకరమైన ఇరాక్ యుద్ధంలో అమెరికాను లాగడానికి ఇజ్రాయెల్ ఉపయోగించిన అదే తంత్రం ఇది అన్నారు. ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వడం తన వల్ల కాదని, అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని, అమెరికన్ ప్రాణాలను ఏ విధంగానూ సమర్థించని యుద్ధంలో తదుపరి తరాలను పోరాడి, మరణించడానికి పంపడాన్ని సమర్థించలేనని ఆయన స్పష్టం చేశారు.
ఆంగ్ల సారాంశం
ఎన్‌సిటిసి డైరెక్టర్ జో కెంట్ ఇరాన్ యుద్ధంపై గణనీయమైన విధానపరమైన విభేదాల మధ్య రాజీనామా చేశారు, పరిపాలనలో ఉద్రిక్తతలు మరియు అనుబంధ లాబీయింగ్ గ్రూపుల ప్రభావాన్ని హైలైట్ చేశారు.