భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడులకు ధీటుగా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఇజ్రాయెల్, అలాగే అమెరికా స్థావరాలపైకి ప్రయోగిస్తోంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంపై భారత్ విధానం ఏంటన్నదానిపై మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై ఆందోళన ఉందని అన్నారు. భారత్ సరిహద్దు దేశం కాబట్టి పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
“దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో వివిధ పనులు చేస్తూ జీవిస్తున్నారు. అలాగే ఇరాన్ లోనూ వేల మంది భారతీయులు విద్య, ఉపాధి పొందుతున్నారు. ఆ ప్రాంతం భారత్ ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే ఆయిల్ గ్యాస్ సరఫరాకు కీలకంగా ఉంది. వీటి సరఫరాపై నెలకొన్న సందిగ్ధత, వాతావరణ ప్రతికూల పరిస్థితులు కచ్చితంగా సీరియస్ సమస్యలు” అని జై శంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం భారత్లోని చమురు నిల్వలు, సరఫరా కొరతపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందని సమాచారం.
అలాగే యుద్ధం కారణంగా భారత ప్రాదేశిక జలాల్లో ఒడిదుడుకులు నెలకున్నాయని వీటి కారణంగా భారత్ కు చెందిన ఇద్దరు నావికులను కోల్పోయామని.. మరొకరు మిస్సింగ్ అయినట్లు జై శంకర్ తెలిపారు. అదనంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దౌత్యం, చర్చల వల్లే ఉద్రిక్తతలు సద్దుమణుగ ప్రకటించారు. భారత్ ప్రభుత్వం గత నెల నుంచి ఇదే చెబుతూ వస్తోందని జై శంకర్ తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధం తీరును క్షుణ్ణంగా ఉన్నారని అలాగే సంబంధిత మంత్రిత్వ శాఖల సమీక్షలు జరిగాయి. ప్రధాని మోదీ.. యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ స్వయంగా మాట్లాడి భారతీయుల భద్రత గురించి అక్కడికి చేరుకున్నారు. అలాగే భారత్ ఇప్పటిదాకా దాదాపు 67 వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి తరలించిందని జై శంకర్ స్పష్టం చేశారు.

