seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 11:49 am Digital Edition : SEEMA KIRANAM

ఇరాన్ నౌకపై దాడి .. 101 మంది గల్లంతు.. | ఇరానియన్‌వార్‌షిప్ ఐరిస్ డానా శ్రీలంక నీటిపై దాడి చేసింది – ప్రధాన నౌకాదళ సంఘటనలో 101 సిబ్బంది తప్పిపోయారు

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

శ్రీలంక తీరంలో ఇరాన్ కు చెందిన ఐరిస్ డేనా అనే యుద్ధనౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో 101 మంది గల్లంతు అయినట్లు సమాచారం. అలాగే ఒకరు మృతి చెందారు. మరో 78 మంది గాయపడినట్లు కనిపిస్తున్నాయి. శ్రీలంక నేవీ, శ్రీలంక డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటన మార్చి 4న తెల్లవారుజామున జరిగినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఈ నౌకపై దాడి చేసింది ఎవరో తెలియాల్సి ఉంది. అయితే దాడి జరిగిన సమయంలో యుద్ధనౌక పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన శ్రీలంక నేవీ అధికారులు సముద్రంలో చిక్కుకున్న వారిని గల్లంతైన కారాపిటియా టీచింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై శ్రీలంక నేవీ అధికారి మాట్లాడుతూ.. 101 మంది మిస్సింగ్ అనేది వాస్తవం కాదని తేలింది. ఈ ఘటనలో గాయపడిన 32 మందిని శ్రీలంక నేవీ అధికారులు రక్షించారు.. ప్రస్తుతం చికిత్స అందించినట్లు తెలిపారు.

ఇదే విషయంపై శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హేరాత్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక నుంచి తనకు డిస్ట్రెస్ కాల్ వచ్చిందని.. మార్చి 4 ఉదయం 6 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని చెప్పారు. అయితే ఈ నౌకపై దాడి చేసింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియదని.. ఈ నౌక సముద్రంలో మునిగిపోయిందని స్పష్టం చేశారు.

ఇక మరో నేవీ ఆఫీసర్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఆసుపత్రికి తరలించిన వారిలో ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. అలాగే ఈ దాడిలో దాదాపు 79 మందిని రక్షించి ఆసుపత్రికి చేర్చామని.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడుల నేపథ్యంలో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇరానియన్‌వార్‌షిప్ ఐరిస్ డానా శ్రీలంక వాటర్‌పై దాడి చేసింది, ప్రధాన నౌకాదళ సంఘటనలో 101 సిబ్బంది తప్పిపోయారు

మరోవైపు యుద్ధంపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో చర్చలు జరిపే ఆలోచన తనకు లేదని ఇరాన్ గుర్తించింది. అమెరికా యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉందని ఖమేనీ సన్నిహుతుడు స్పష్టం చేశారు ఇక తమతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Source link