అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->గత 20 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులను ఉద్ధృతం చేసింది. ఈ అవకాశం ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని పెజెష్కియాన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన, స్టెబిలిటీపై మాట్లాడారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ శాంతి, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. 8 రోజుల వ్యవధిలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడటం ఇది రెండోసారి. అయితే తాజాగా జరిపిన సంభాషణలో ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడికి ‘ఈద్’ అలాగే ఇరాన్ నూతన సంవత్సరం ‘నౌరూజ్’ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే పశ్చిమాసియా ప్రాంతంలోని కీలకమైన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు స్థానికంగా స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుంది, దానితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్లై చైన్ ను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రం ద్వారా రవాణా స్వేచ్ఛగా కొనసాగాలని నౌకామార్గాలు తెరచి ఉంచడం, వాటిని సురక్షితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరాన్‌లో భారత పౌరుల భద్రత కోసం ఇరాన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రధాని అభినందించారు.

గతంలో మార్చి 12న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. ఆ తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్ తదితర నాయకులతో ప్రధాని మోదీ ప్రసంగించి అక్కడి పరిస్థితులపై చర్చలు జరిపారు.