seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 10:00 am Digital Edition : SEEMA KIRANAM

ఇరాన్‌లో యుద్ధ మేఘాలు- తక్షణమే ఆ దేశం వీడండి, కేంద్రం బిగ్ అలర్ట్..!! | ఇరాన్‌లోని పౌరులకు భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది, దేశం విడిచి వెళ్లమని వారిని అడుగుతుంది, వివరాలు ఇక్కడ ఉన్నాయి

అంతర్జాతీయ

-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ ఉంటున్న భారత పౌరులు వెంటనే అక్కడ ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచిపెట్టాలని సూచించారు. ఇరాన్‌పై ఏ క్షణమైన అమెరికా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇరాన్ వీడి.. స్వదేశానికి వచ్చే వాణిజ్య విమానాలు కూడా అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని వారిని కోరింది. ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు సైతం ఈ సూచనలు వర్తిస్తాయి.

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత రాయబార కార్యా లయం అక్కడ భారత పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఎప్పుడైనా మొదలయ్యే అవకాశాలతో, భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఇరాన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జనవరి 5న భారత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా ఈ కొత్త అడ్వైజరీని జారీ చేసింది.

ఇరాన్‌లోని జాతీయులకు భారత రాయబార కార్యాలయం-ఇష్యూలు-హెచ్చరిక-వివరాలు ఇక్కడ-దేశం విడిచిపెట్టమని అడుగుతుంది

ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు.. విద్యార్థులు,యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు-అందుబాటులో ఉన్న కమర్షియల్ విమాన సర్వీసులు లేదా ఇతర ప్రయాణ సౌకర్యాలను వినియోగించి తక్షణమే దేశాన్ని వీడాలని సూచించారు. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని స్పష్టం చేసింది.

ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, స్థానిక మీడియా ద్వారా తాజా పరిణామాలను గమనించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ తమ పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులు, ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని. అవసరమైతే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని, ఇంకా ఎంబాసీ వద్ద తమ వివరాలను నమోదు చేసుకోని వారు వెంటనే పూర్తి చేసుకోవాలని అడ్వైజరీలో స్పష్టం చేశారు.

తమ పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ప్రయాణ పత్రాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని. టెహ్రాన్‌లోని రాయబార పేరు నమోదు చేసుకోని వారు వెంటనే.. అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. అత్యవసర సమయంలో ఇక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసింది. +989128109115; +989128109109; +989128109102; +989932179359. అలాగే (ఇమెయిల్ రక్షించబడింది) ఈ మెయిల్ ద్వారా తమను సంప్రదించాలని ఇరాన్‌లోని భారతీయులకు భారత్ సూచించింది.

ఆంగ్ల సారాంశం

యుఎస్‌తో ఉద్రిక్తతల మధ్య యూనివర్శిటీలలో నిరసనలు మరియు ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌ను విడిచిపెట్టాలని పౌరులను కోరింది

Source link