Wednesday, April 1, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణ"ఇప్పుడు అందుబాటులో ఉంది": మాజీ ఆర్మీ ఛీఫ్ బుక్ పై రాహుల్ మరో షాక్-పెంగ్విన్ విలవిల..!...

“ఇప్పుడు అందుబాటులో ఉంది”: మాజీ ఆర్మీ ఛీఫ్ బుక్ పై రాహుల్ మరో షాక్-పెంగ్విన్ విలవిల..! | రాహుల్ గాంధీ నారావానే యొక్క 2023 ‘ఇప్పుడు అందుబాటులో ఉంది’ పోస్ట్‌ను పబ్లిషర్ మెమోయిర్ క్లెయిమ్‌ను తగ్గించడానికి ఉపయోగించారు

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

మాజీ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ” పుస్తకంలోని అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించడానికి ప్రయత్నించి విఫలమైన తర్వాత బయటికి వచ్చి ఆ బుక్‌ను నేరుగా ప్రదర్శించి విపక్ష నేత రాహుల్ గాంధీ (రాహుల్ గాంధీ) షాకిచ్చారు. ఇప్పటికే ఈ పుస్తకం ప్రచురణ హక్కులు పొందిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (పీఆర్ హెచ్‌ఐ) బుక్కయింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన పెంగ్విన్ తాము ఈ ప్రచురించిన పుస్తకంలోని అంశాలను ఎవరైనా బయటపెడితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు రాహుల్ పై కేసు పెట్టారు.

ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మరోసారి ఈ పుస్తకం వివాదంపై స్పందించారు. మాజీ ఆర్మీఛీఫ్ రాసిన పుస్తకంలోని అంశాలను, అసలు ఆ విషయాన్ని బయటపెట్టిన తర్వాత నెలకున్న వివాదంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పెంగ్విన్, నరవణెల్లో ఎవరు కరెక్ట్ అని ప్రశ్నించారు. అంతే కాదు నరవణేను నమ్ముతారా పెంగ్విన్ ను నమ్ముతారా అని కూడా సూటి ప్రశ్న వేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక అంతా తికమక పడాల్సిన పరిస్థితి.

పబ్లిషర్ మెమోయిర్ క్లెయిమ్‌ను తగ్గించడానికి రాహుల్ గాంధీ నరవనే 2023 ఇప్పుడు అందుబాటులో ఉంది

మాజీ ఆర్మీ ఛీఫ్ నరవణే గతంలో చైనాతో యుద్దం చేస్తున్నప్పుడు, ప్రత్యర్థి సైనికులు, యుద్ధ ట్యాంకులు మన సరిహద్దుల వరకూ వచ్చిన తాను కేంద్రానికి చెప్పినా స్పందించలేదని ఈ బుక్‌లో రాసినట్లు రాహుల్ గాంధీ గతంలో చెప్పారు. దీంతో ఈ పుస్తకం కాస్త వివాదంగా మారింది. ఆ తర్వాత ఆర్మీ ఈ పుస్తకం విడుదలకు అనుమతి ఇవ్వలేదని ప్రకటించారు. కేంద్రం కూడా ప్రచురించని పుస్తకాన్ని తీసుకొచ్చి ఏంటి రచ్చ అని రాహుల్ ను పార్లమెంట్ లో అడ్డుకుంది. ఈ నేపథ్యంలో పెంగ్విన్ స్పందించడం, ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడంపై స్పందించిన రాహుల్.. గతంలోనే ఈ పుస్తకం 2023లోనే ఆన్‌లైన్‌లో ఉన్నట్లు నరవణే పెట్టిన ట్వీట్ ను అందరికీ చూపించారు. దీంతో ఈ మరో వివాదం మలుపు తిరిగింది.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular