ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రిక మార్పులు తీసుకొస్తున్నారు. అధిక సంతానం కనే దంపతులకు బంపర్ బహుమతులను ప్రకటించారు. ప్రతి కుటుంబంలోని కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగేకొద్దీ వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని చంద్రబాబు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ దిశగా కీలక అడుగులు వేస్తున్న వేళ చంద్రబాబు శాసనసభలో సంచలన ప్రకటన చేశారు.
ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం రూ.25 వేలు
ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్న నూతన విధానం ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం 25 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్టు చంద్రబాబు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాధాన్యత అంశం కాగా ఇప్పుడు జనాభా పెరగడం అవసరంగా భావించిన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఏపీలో పడిపోయిన సంతానోత్పత్తి రేటు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు బాగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం ఏపీలో సంతాన ఉత్పత్తి రేటు 1.5 పడిపోయింది. సుస్థిర అభివృద్ధికి ఇది 2.1 శాతంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 2004 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23 చేరుతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై భారం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మూడవ బిడ్డ పుడితే తండ్రికి రెండు నెలల పాటు పెయిడ్ లీవ్
ఎక్కువ మంది పిల్లలున్న తల్లులకు ఇద్దరికీ కాన్పు సమయంలో 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి భరోసా ఇస్తుంది.అంటేకాదు రెండో బిడ్డ పుడితే తండ్రికి ఒక నెల రోజులు, మూడవ బిడ్డ పుడితే తండ్రికి రెండు నెలల పాటు పెయిడ్ లీవ్ చేస్తారు. ఆర్థికగతులతో సంబంధం లేకుండా జనాభా పెరుగుదల కోసం ఈ పథకం ఏపీ ప్రోత్సహిస్తుంది.
రాజకీయ ప్రారంభంలో తగ్గే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆలోచన
దక్షిణ భారత రాష్ట్రాలలో జనాభా తగ్గడం వలన భవిష్యత్తులో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన సమయంలో రాజకీయంగా తగ్గే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. వచ్చే నెల రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ డ్రాఫ్ట్ పాలసీకి తుది రూపు ఇవ్వనున్నారు.
జనాభా నిర్వహణలో దేశంలోనే రోల్ మోడల్ గా ఏపీ
జనాభా నిర్వహణలో దేశంలోనే ఏపీ ఒక రోల్ మోడల్ గా నిలవాలని చంద్రబాబు సర్కార్ ఆశిస్తున్నట్లు తాజాగా అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇది భవిష్యత్తుపై ముందు చూపుతోనే అందించబడింది. మరి ప్రజల నుండి చంద్రబాబు ఇచ్చిన బంపర్ ఆఫర్ కు రెస్పాన్స్ ఎలా వస్తుందో వేచి చూడాలి.
ఆంగ్ల సారాంశం
జనాభా పెరుగుదలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన కొత్త విధానంలో ఏప్రిల్ 1 నుంచి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు రూ.25,000 నగదు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.