తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడారు. ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో అన్ని వర్గాల వారిని మోసం చేస్తారని కవిత తెలిపారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు అందరినీ మోసం చేశారని కవిత ధ్వజమెత్తారు.
మంత్రులు ఒకరిని మించి ఒకరు ఫేక్ ముచ్చట్లు: కవిత
ఒక్కో కుటుంబంపై రూ.9లక్షల అప్పులు చేశారు. బడ్జెట్ లో తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించాం. కాంగ్రెస్ ఒకరిని మించి ఒకరు ఫేక్ ముచ్చట్లు చెబుతున్నారని నాయకులు తెలిపారు.మోడీ బడే భాయ్ అని ఢిల్లీకి వందరూపాయలు కూడా తేలేదని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ మా హైదరాబాదీ సలీం ఫేక్ లాంటి వ్యక్తి అన్న కవిత సలీం ఫేక్ కనీసం ప్రజలను నవ్విస్తాడు.. కానీ రాహుల్ మా ప్రజలను ఏడిపిస్తున్నాడు.

ప్రభుత్వానికి విజన్ లేదు అందుకే రివిజన్ బడ్జెట్
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వమని కవిత పేర్కొన్నారు. అందుకే ఇక నుంచి రాహుల్ గాంధీకి “రాహుల్ ఫేక్” అని నామకరణం చేస్తున్నాం అన్నారు కవిత. రైతు భరోసా చేయూత పింఛన్లు సహా చాలా రంగాలకు కేటాయించిన నిధులను అక్షరం మార్చకుండా అలాగే కొత్త బడ్జెట్లో పెట్టబడ్డాయి. ఈ ప్రభుత్వానికి విజన్ లేదని అందుకే రివిజన్ బడ్జెట్ అంటున్నామని చెప్పారు.
అప్పుల డబ్బులు ఏం చేస్తున్నారు
ఏటా బీసీలకు 20 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక ఫేక్ చెప్పారని మాత్రం గాంధీ నాలుగు శాతం నిధులు కేటాయించి బీసీలను మోసం చేశారన్నారు. లక్షల కోట్ల అప్పులు తెస్తున్న రేవంత్ సర్కార్ ఆ డబ్బులను ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రజలకు పైసా మేలు జరగడానికి. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఈసారి కూడా పత్తా లేకుండా పోయింది.
నిరుద్యోగంలో తెలంగాణా రైజింగ్
ఇందిరమ్మ ఇళ్లకు ప్రస్తుతం ఈసారి ఏడు వేల రూపాయల కోత పెట్టారు. ఉద్యోగాల నియామకాలకు ఎటువంటి కేటాయింపులు లేవని, తెలంగాణ నిరుద్యోగంలో కొత్త రైజింగ్ అంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందన్నారు. కేవలం 13 వేల ఉద్యోగాలను భర్తీ చేసి 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు కవిత.

