seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 8:32 pm Digital Edition : SEEMA KIRANAM

ఇజ్రాయెల్ గడ్డపై ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన నెతన్యాహు | pmmodi ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు: నెతన్యాహు భార్యతో కలిసి సాదర స్వాగతం చారిత్రాత్మక సంబంధాలు బలోపేతం!

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ గడ్డపై పెట్టిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ తన సతీమణి సారాతో కలిసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన భాగస్వామ్యం, వ్యూహాత్మక ఒప్పందాల గురించి వివరిస్తోంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ లో ఘన స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ లో ఆయన విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ దేశ ప్రధాని నెతన్యాహు తన సతీమణి సారాతో కలిసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయంలోనే ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. మోదీ చివరగా 2017లో ఇజ్రాయెల్‌లో ఉన్నారు. దాంతో ఇజ్రాయెల్‌లో మొదటి భారత ప్రధాని మోదీ రికార్డు నెలకొల్పారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన ఇజ్రాయెల్ పర్యటన.

ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డిఫెన్స్ రంగాలపై ప్రసంగించనున్నారు. అలాగే ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనం నెస్సెట్ లో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీ, ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉంది. అనంతరం ప్రధాని నెతన్యాహు ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిన్నర్ లో ప్రధాని మోదీ పాల్గొంటారు.

భార్యతో కలిసి ఇజ్రాయెల్ చేరుకున్న నెతన్యాహు సాదరంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ చారిత్రాత్మక సంబంధాలు బలోపేతం

అలాగే ఫిబ్రవరి 26 గురువారం.. ప్రధాని మోదీ యద్ వషేమ్(ఇజ్రాయెల్ అధికారిక మెమోరియల్, 1953లో స్థాపించారు. 60 లక్షల మంది జువిస్ ను నాజీలు హతమార్చారు. అందుకు నివాళిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు) లో నివాళులు అర్పించనున్నారు. అయితే ఇజ్రాయెల్ లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జెరుసలేం పోస్ట్ పత్రికలో ఫ్రంట్ పేజీలో ప్రధాని మోదీకి ఆహ్వానం అంటూ ప్రచురించారు. ఇక ఈ పర్యటనపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “నా స్నేహితుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు నేను ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నాను. ఫిబ్రవరి 25-26 తేదీల్లో ఈ పర్యటన ఉంటుంది అని ప్రధాని మోదీ అన్నారు.

Source link