Thursday, April 9, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇక సీఎం పదవి కోసం కోట్లాడుతా - కోమటిరెడ్డి సంచలనం..!! | మంత్రి పదవి, భవిష్యత్తు...

ఇక సీఎం పదవి కోసం కోట్లాడుతా – కోమటిరెడ్డి సంచలనం..!! | మంత్రి పదవి, భవిష్యత్తు రాజకీయాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి కోసం కొంత కాలంగా కోమటిరెడ్డి వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. తనకు హైకమాండ్ నుంచి మంత్రి పదవి పైన హామీ ఉందని రాజ గోపాల్ రెడ్డి చెప్పారు. కాగా, ఇప్పుడు మరింత ఘాటు వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చేస్తారా.. మంత్రిని చేయండి.. ఇచ్చిన మాటకు కట్టుబడి.. లేదంటే టార్గెట్‌ నేరుగా ముఖ్యమంత్రి పదవే”నంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ నుంచి మంత్రి పదవి పైన హామీ ఉంది. దీంతో.. ముగ్గురు మంత్రులతో కేబినెట్ విస్తరణ తరువాత రాజగోపాల్ రెడ్డి తనకు ఛాన్స్ దక్కకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి అడ్డుకుంటున్నారంటూ సీఎం రేవంత్ సహా.. జానారెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రి పదవి, భవిష్యత్తు రాజకీయాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

నిత్యం ఏదో విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఇప్పటికీ కోమటిరెడ్డి ఆశాభావంతో ఉన్నారు.

కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యలతో

దీనికి కొనసాగింపుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తనకు పదవి అదే వస్తదని… మంత్రి పదవి తనకు అడుక్కోవడం రాదని చెప్పుకొచ్చారు. సమయం వస్తే లాక్కుంటానని మీరు ఇచ్చిన మాట ప్రకారం పదవి ఇవ్వండి, లేదంటే నేనే ముఖ్యమంత్రి పదవి కోసం కోట్లాడతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పైసలు, నిధులు అన్నీ మీకేనా అంటూ రేవంత్ రెడ్డి గతంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామే తప్ప కబ్జాలు చేయడానికి రాలేదు.. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఇక.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తరువాత రేవంత్ బలం మరింత పెరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ టైం లో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన పార్టీ నాయకత్వం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular