అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై రెండు వారాలు దాటినా ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ తన బ్రహ్మాస్త్రం అయిన హార్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అలాగే ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇరాన్ లోని కీలక స్థావరాలపై దాడులను ఉద్ధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ మిలటరీ సామర్థ్యాలను 100 శాతం నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు చైనా, ఫ్రాన్స్,, సౌత్ కొరియా, యూకే లాంటి జపాన్ తమ నౌకలను హార్మూజ్ జలసంధి వద్ద పంపాలని ఉంది. ఇరాన్ మిలిటరీ శక్తిని వంద శాతం నాశనం చేసిన ఇరాన్ ను నమ్మే పరిస్థితిలో లేమని తేల్చారు. ఇరాన్ ఇంకా డ్రోన్లు, సీ-మైన్స్, షార్ట్ రేంజ్ క్షిపణులతో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని అన్నారు. ఇరాన్ లాంటి దేశంతో ఎప్పుడైనా ముప్పు పొంచి ఉంటుందని అన్నారు.
ఇక త్వరలోనే హార్మూజ్ జల సంధిని అమెరికా ఓపెన్ చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధిని సురక్షితంగా, స్వేచ్ఛగా ఉంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు భారత్ నౌకలను హార్మూజ్ జలసంధి గుండా ఉపయోగించేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం ఓకే అయింది. తాజాగా భారత్ జెండాలు కలిగిన రెండు భారీ నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. 92 వేల టన్నుల LPG తో హార్మూజ్ జలసంధిని ఈ నౌకలు దాటినట్లు స్పష్టం అవుతోంది. మార్చి 16 లేదా 17 నాటికి ఈ నౌకలు భారత్‌కు చేరుకోనున్నాయి.

ఇదిలా ఉంటే హార్మూజ్ జలసంధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అంశాలు. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి వద్ద భారత్ కు చెందిన 24 నౌకలు ఉన్నాయని.. అవన్నీ సురక్షితంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నౌకలు ఎల్పీజీ సరుకుతో ఈ నెల 16,17 తేదీల మధ్య భారత్ లోని కండ్ల, ముంద్రా పోర్టులకు చేరుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

