Saturday, March 21, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు! | 10వ...

ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు! | 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఏకీకృత విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకొస్తున్నామని రేవంత్ రెడ్డి పదవతరగతి పరీక్షల పైన ఊహించని శుభవార్త చెప్పారు. తాజాగా మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సమగ్ర మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు. ముఖ్యంగా పదవ తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

టెన్త్ పరీక్షలను రద్దు చేసే దిశగా ఆలోచనలు

ఇకపై సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే టెన్త్ పరీక్షలను రద్దు చేసే దిశగా తమ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అమలులో ఉన్న పరీక్షా విధానం విద్యార్థుల పైన తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని, దీనిని తగ్గించడం కోసమే సరికొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు.

నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఏకీకృత విద్యా విధానాన్ని ప్రవేశపెడుతూ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

12వ తరగతి వరకు ఒకే విధమైన విద్యా విధానం

నర్సరీ నుంచి 12వ వరకు ఒకే విధమైన విద్యా విధానాన్ని ఎంపిక తరగతి పెట్టుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విధానంలో నిరంతర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక్కసారి పరీక్షలు పెట్టే బదులు, సంవత్సరమంతా విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి కృషి చేశారు.

బోధనలో మరింత నాణ్యతను పెంచే చర్యలు

ఈ కొత్త విధానంలో విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ , నైపుణ్యాలను అభివృద్ధి చేయడం దృష్టి సారించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రయత్నం ద్వారా ఉపాధ్యాయుల పాత్రను మరింత బలోపేతం చేసి, బోధనలో మరింత నాణ్యతను పెంచే చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను ప్రమాణీకరించడం లక్ష్యంగా పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం

అయితే ఈ ప్రతిపాదన పైన అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా నిపుణులను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ఈ మార్పులు అమలులోకి వస్తే విద్యారంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular