తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల జిల్లా ప్రవేశపెట్టడంతో, రాష్ట్రవ్యాప్తంగా అన్నింటిలోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. అయితే ఇంకా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చాలామంది ఇల్లు లేని నిరుపేదలు ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా వారందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం
ప్రజా పాలన దరఖాస్తుల ద్వారా తొలి విడతలో 3.60 లక్షల ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం అందించింది. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని చేసిన ప్రభుత్వం, నిర్మాణ దశను బట్టి వారానికి ఒకసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుంది. జిల్లాల వారీగా కలెక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ, ప్రయోజన ప్రయోజన కార్యక్రమాలు చేస్తున్నారు.

మార్చి 31 లోపు అన్ని ఇళ్ళ గ్రౌండింగ్ పూర్తి చెయ్యాలని ఆదేశం
ఇప్పటికే అనేక చోట్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి.ఈ నెలాఖరు నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలిదశ మంజూరైన ఇళ్లకు గ్రౌండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుత 20 శాతం పనులు పూర్తి కాగా మార్చి 31వ తేదీ లోపు అన్ని ఇళ్లు గ్రౌండింగ్ ముగించాలని జూన్ చివరి నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా లబ్ధిదారులను అప్రమత్తం చేసింది.
రెండో జాబితా విడుదలకు నిర్ణయం
ఇదే సమయంలో రెండవ దశ జాబితా విడుదలపై వేగం పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో కొత్త ఇళ్లను ఏర్పాటు చేసింది. అంతకుముందే తొలి దిశ గ్రౌండింగ్ పూర్తి చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఇవి మాత్రమే కాదు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంపైనా కూడా కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మార్చి 31వ తేదీ లోపు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.
ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో కొత్త ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో స్థలం కూడా లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 99 రోజుల పాలనను ప్రగతిశీలంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త ఇందిరమ్మ ఇళ్లను అందించనున్నారు.
ఆంగ్ల సారాంశం
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కొత్త ఇళ్ల మంజూరు ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని ప్రభుత్వం ధృవీకరించింది, ఇది వేలాది మంది లబ్ధిదారులకు ఉపశమనం కలిగించింది.