ఇంటింటికీ పెన్షన్ పంపిణీ.. లబ్ధిదారులతో మమేకమైన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు బుధవారపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 01 (సీమకిరణం న్యూస్):

కర్నూలు నగరంలోని బుధవారపేట ప్రాంతంలో శనివారం నిర్వహించిన సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి చేతికి పెన్షన్ నగదును అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి పారదర్శకంగా, సకాలంలో అందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సంబంధిత సిబ్బందికి సూచించారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.