తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->మాజీ సీఎం కేసీఆర్ ఆలోచన హెల్త్ సిటీ అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతోందని, ప్రజల ఆరోగ్య రక్షణ కల్పించే ఆసుపత్రి పనులు అంతగా లేవు కానీ, ఫ్యూచర్ సిటీ కడతారా? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను మాజీ మంత్రి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆసుపత్రి ప్రారంభం అయ్యేది: హరీష్ రావు
హాస్పిటల్ నిర్మాణంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటికి ఆసుపత్రిని ప్రారంభించేవాళ్లమని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆలోచన హెల్త్ సిటీ అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతోందని మంచు. 24 అంతస్తుల భవనాన్ని కేసీఆర్ నిర్మించారని, ఫినిషింగ్ వర్క్ కూడా రేవంత్ సర్కార్ ఇప్పటివరకు చెయ్యలేకపోయిందని అన్నారు.

పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి.. లేదంటే ధర్నా చేస్తాం
అవసరమైన నిధులు గత ప్రభుత్వమే అందించింది. జూన్ 2న హాస్పిటల్ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోందని. కేవలం ఓపీ సేవలతో ప్రారంభించడం సరిపోదని అన్నారు. ఇది బస్తీ దవాఖాన కాదని, కనీస అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడినట్లు. పూర్తి స్థాయిలో ప్రజలకు ఆసుపత్రి తీసుకురాకపోతే ఇక్కడ ధర్నాకు దిగుతామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
ఎంజీఎం ఆసుపత్రిలో అన్నీ సమస్యలే
ఎంజీఎం హాస్పిటల్‌ను రాష్ట్ర మంత్రులు సందర్శించారని, గుండె శస్త్ర చికిత్స లేక సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ యంత్రాలు పనిచేయకపోవడం, మందుల కొరత, వైద్యుల కొరత వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని ఆయన అన్నారు.ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని, ఉద్యోగులకు పీఆర్సీ, బకాయిలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేవాదుల మోటార్లన్నీ విడుదల చేయబడ్డ ఘనత బీఆర్ఎస్ దే
దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి మోటార్లన్నీ విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారని, అయితే అది బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి ఫలితమేనని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఎకరా భూ సేకరణ కూడా జరగలేదని. దేవాదుల ప్రాజెక్టు పూర్తి డెడ్‌లైన్‌లు మారుతున్నాయని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని అన్నారు.గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు.
ఆంగ్ల సారాంశం
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఆస్పత్రి నిర్మాణం, ఎంజీఎం సౌకర్యాలపై సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించి అల్టిమేటం ఇచ్చారు.