seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 1:32 pm Digital Edition : SEEMA KIRANAM

ఆ రైతులకు శుభవార్త..నెలాఖరు వరకు ఛాన్స్.. మిస్ చేసుకోద్దు! | శుభవార్త: పత్తి కొనుగోళ్ల గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు సీసీఐ ప్రకటించింది

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. పత్తి కొనుగోళ్ళ గడువు ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు. 22వ తారీఖున పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణా మంత్రి విజ్ఞప్తి.. స్పందించిన సీసీఐ

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి రైతులు ఇంకా పత్తిని పూర్తి స్థాయిలో అమ్ముకోలేదని రైతుల దృష్టిలో పెట్టుకొని రైతుల సౌకర్యార్థం గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు స్పందించిన cci ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన దానితో వ్యవసాయ శాఖ జైంట్ సెక్రెటరీ కేంద్ర జౌళి శాఖకు లేఖ పంపారు.

శుభవార్త సీసీఐ పత్తి కొనుగోళ్ల గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది

రైతులకు తుమ్మల సూచన

ఈ నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ రైతులు ఈ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంతకుముందు పత్తి కొనుగోళ్లు గడువు పెంచాలని మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

ఈసారి పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు

అలాగే కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు అమ్మకాలకు బుక్ చేసుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇకపై క్వింటాలుకు 8,110 రూపాయలు మద్దతు ధర చాలా మంది రైతులకు సరైన ధర కూడా దక్కలేదు. దీంతో పత్తి రైతులు తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అకాల వర్షాలు, వరదల కారణంగా పత్తి దిగుబడి కూడా తగ్గింది.

రైతులకు సీసీఐ నిర్ణయంతో సంతోషం

పంట ఆలస్యంగా రైతుల చేతికి వచ్చింది. అనేక సమస్యలతో పత్తి రైతులు ఇబ్బంది పడిన వేళ సీసీఐ కొనుగోలు కొంత ఆలస్యంగా మొదలయ్యాయి. సాధారణంగా పత్తిని మార్చి నెల వరకు కూడా సీసీఐ కొనుగోలు చేస్తుంది. కానీ ఈసారి ముందే కేంద్రాలను నిర్ణయించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత సీసీఐ తాజా నిర్ణయం రాష్ట్రంలోని పత్తి రైతులలో సంతోషాన్ని నింపుతుంది.

ఆంగ్ల సారాంశం

పత్తి కొనుగోళ్ల గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు సీసీఐ ప్రకటించింది. తొలుత ఈ నెల 22న కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించిన కార్పొరేషన్ తెలంగాణలోని రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని సవరించుకుంది.

Source link