seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 3:53 am Digital Edition : SEEMA KIRANAM

ఆ జిల్లాను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. కోడిగుడ్లు, కోళ్ళు విక్రయాలపై నిషేధం! | బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపించడంతో చిత్తూరు జిల్లాలో గుడ్లు, కోళ్ల విక్రయాలపై నిషేధం, అధికారులు అప్రమత్తం

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరణ స్థానికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న అధికారులు అప్రమత్తమయ్యారు. సదుం మండలాలలో ఇప్పటికే నిర్ధారణ అయిన ఈ బర్డ్ ఫ్లూ, కార్వేటి నగరంలో కూడా కలకలం రేపుతుంది. అయితే అప్రమత్తమైన జిల్లా ప్రత్యేక రాపిడ్ యాక్షన్ టీంను రంగంలోకి దింపింది.

కోళ్లు, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం

కలెక్టర్ రూమ్ కంట్రోల్ ను కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ సమిత్ కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేయగా అధికారులు సామూహిక మరణాల పైన ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో కోడిగుడ్లను, కోళ్లను ఎవరికి అమ్మకూడదని, ఆ ప్రాంతంలో కోళ్లు, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధించారు.

బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపించడంతో చిత్తూరు జిల్లాలో గుడ్లు, కోళ్ల విక్రయాలపై నిషేధం విధించిన అధికారులు అప్రమత్తమయ్యారు

కోళ్ళ రక్త నమూనాలను భోపాల్ లోని ల్యాబ్ కు

నిన్న ఒక్కరోజే వెయ్యికి పైగా ఆర్కేవి పేట, ఇందిరా కాలనీలో కోళ్లఫారాలలో కోళ్లు మృతి చెందాయి. దీంతో ఫారం యజమానులు అధికారులకు తెలియజేశారు. చనిపోయిన కోళ్ళను అధికార యంత్రాంగం జాగ్రత్తగా పూడ్చి పెడుతోంది. చనిపోయిన కోళ్లకు సంబంధించి రక్త నమూనాలను భోపాల్ లోని ల్యాబ్ కు పంపారు. ఈ మేరకు కారణాలు తెలిసే వరకు కోడిగుడ్లను, కోళ్లను విక్రయించరాదని ఫారం యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పౌల్ట్రీ ఫామ్ ల నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను విధిగా పాటించాలి

అంతేకాదు ఎక్కడైతే భారీ సంఖ్యలో మృతి చెందాయో అక్కడ ఇతరులను అనుమతించవద్దు, వాహనాలను రానివ్వకూడదు అని యజమానులకు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నివారణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ ల నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను విధిగా పాటించాలని అధికారులు.

బర్డ్ ఫ్లూ విస్తరిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల కోళ్ల ఫారాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో కోళ్ల పెంపకం జరుగుతోంది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కోళ్ళ ఎగుమతులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీంతో అధికారులు ఈ వ్యాధి విస్తరణ కట్టడి చేసేందుకు, పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతున్నారు.

ఆంగ్ల సారాంశం

చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది, వేలాది కోళ్లు మృత్యువాత పడుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గుడ్లు, కోళ్ల విక్రయాలపై అధికారులు నిషేధం విధించారు.

Source link