ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరణ స్థానికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న అధికారులు అప్రమత్తమయ్యారు. సదుం మండలాలలో ఇప్పటికే నిర్ధారణ అయిన ఈ బర్డ్ ఫ్లూ, కార్వేటి నగరంలో కూడా కలకలం రేపుతుంది. అయితే అప్రమత్తమైన జిల్లా ప్రత్యేక రాపిడ్ యాక్షన్ టీంను రంగంలోకి దింపింది.
కోళ్లు, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం
కలెక్టర్ రూమ్ కంట్రోల్ ను కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ సమిత్ కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేయగా అధికారులు సామూహిక మరణాల పైన ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో కోడిగుడ్లను, కోళ్లను ఎవరికి అమ్మకూడదని, ఆ ప్రాంతంలో కోళ్లు, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధించారు.

కోళ్ళ రక్త నమూనాలను భోపాల్ లోని ల్యాబ్ కు
నిన్న ఒక్కరోజే వెయ్యికి పైగా ఆర్కేవి పేట, ఇందిరా కాలనీలో కోళ్లఫారాలలో కోళ్లు మృతి చెందాయి. దీంతో ఫారం యజమానులు అధికారులకు తెలియజేశారు. చనిపోయిన కోళ్ళను అధికార యంత్రాంగం జాగ్రత్తగా పూడ్చి పెడుతోంది. చనిపోయిన కోళ్లకు సంబంధించి రక్త నమూనాలను భోపాల్ లోని ల్యాబ్ కు పంపారు. ఈ మేరకు కారణాలు తెలిసే వరకు కోడిగుడ్లను, కోళ్లను విక్రయించరాదని ఫారం యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పౌల్ట్రీ ఫామ్ ల నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను విధిగా పాటించాలి
అంతేకాదు ఎక్కడైతే భారీ సంఖ్యలో మృతి చెందాయో అక్కడ ఇతరులను అనుమతించవద్దు, వాహనాలను రానివ్వకూడదు అని యజమానులకు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నివారణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ ల నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను విధిగా పాటించాలని అధికారులు.
బర్డ్ ఫ్లూ విస్తరిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల కోళ్ల ఫారాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో కోళ్ల పెంపకం జరుగుతోంది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కోళ్ళ ఎగుమతులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీంతో అధికారులు ఈ వ్యాధి విస్తరణ కట్టడి చేసేందుకు, పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతున్నారు.
-

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, వైసీపీ అనూహ్య నిర్ణయం..!?
-

175 నియోజకవర్గాలకు ర్యాంకుల ప్రకటన, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు…!!
-

కొన్ని లోపాలు ఉన్నాయి,ఉదాసీనత వీడండి- పవన్ కీలక వ్యాఖ్యలు..!!
-

175 నియోజకవర్గాల్లోనూ, ఇక నుంచి – టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!!
-

ఉద్యోగుల పదవీ విరమణ, పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు – ఇక పై ఇలా..!!
-

ఏపీలో బుల్లెట్ రైళ్ల కారిడార్, ఎన్ హెచ్ ప్రాజెక్టుల దూకుడు.. సీఎం చంద్రబాబు కీలకదేశం
-

పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు!
-

పవన్ కళ్యాణ్ కు వీరంతా పొలిటికల్ ప్రొడ్యూసర్లు..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-

10రూపాయలకే కార్పోరేట్ వైద్యం, సర్జరీలు, మందులు.. భోజనం కూడా ఫ్రీ!
-

హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక నుంచి..!!
-

T20 World Cup: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్‌కు పిలుపు..!!
-

ఎట్టకేలకు రైతు భరోసా నిధులకు లైన్ క్లియర్, ఆ రోజునే జమ..!!
-

ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో భారీ సినిమా..! రాండ్ రాక్ స్టోరీతో..
-

తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోతున్నాయి
-

స్థలం ఉన్నా, లేకున్నా మీకు సొంతిల్లు గ్యారెంటీ!
















