తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->తెలంగాణలో రేపాటి(ఫిబ్రవరి 25) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది.. అలాగే రెండో సంవత్సరంలో 5,07,949 మంది కలిపి మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అయితే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులకు ఊరటను కలిగిస్తూ.. తొలిసారి గ్రేస్ పీరియడ్ గా 5 నిమిషాలకు కేటాయించారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 9:05 నిమిషాల వరకు ఇంటర్నెట్‌కి అనుమతించబడుతుంది.
ఇక విద్యార్థులు సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునే విధంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు.. తమ హాల్ టికెట్, కన్షెషనల్ పాస్ చూపిస్తే ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో నడిపేందుకు అనుమతి ఇచ్చారు. పాస్ లో ఉన్న ప్రాంతం వరకే కాకుండా ఎగ్జామినేషన్ కేంద్రం వరకు విద్యార్థులు ఫ్రీగా బస్సులో ప్రయాణించాలని అధికారులు తెలియజేశారు. విద్యార్థులు.. వారి ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వరకూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అమ్మాయిలకు ఎలాగూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఉన్న విషయం తెలిసిందే.
ఇంటర్ పరీక్షలు రాసే అబ్బాయిలు.. తమ హాల్ టికెట్, పాస్ చూపిస్తే ఎక్కడినుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది తెలంగాణ ఆర్టీసీ. ఫిబ్రవరి 25 మార్చి 13 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వెసులుబాటు అన్ని పరీక్షలకు వర్తిస్తుందని.. అలాగే ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాలు కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుందని TGSRTC.

అయితే ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ. 20 చెల్లించి కాంబో టికెట్ తో విద్యార్థులు ప్రయాణం చేయమని స్పష్టం చేసింది. ఇక బస్ పాస్ లేని విద్యార్థులు సాధారణ టికెట్ తీసుకుని రావాలని TGSRTC. అలాగే విద్యార్థుల సౌలభ్యం కోసం బస్సులను ఎక్కడైనా ఆపాలని అధికారులకు సూచనలు చేసింది.