ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలిసికట్టుగా కొనసాగాలని కూటమి తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు తప్పులు చేయలేదని స్పష్టం చేసారు. ఎమ్మెల్యేల పని తీరు పైన నివేదికల ఆధారంగా తమ వైఖరిని కలిగి ఉంది. కూటమి బలం మరింత పెరిగిందని చెప్పారు. మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలని ఆకాంక్షించారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యే తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూటమి ఎమ్మెల్యేలకు తమ లక్ష్యం ఏంటో తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. ఈ ఇరవై నెలల్లో మూడు పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభపరిణామమని చెప్పారు. ఇకపైనా ఐక్యత కొనసాగాలని, కింది స్థాయి వరకు ఇలాగే ఉండాలని.. అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తితో మున్ముందు కూడా పనిచేయాలని నిర్దేశించారు.

మూడు పార్టీలూ ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండాలని సూచించారు. గుజరాత్‌లో వరుసగా ఐదుసార్లు బీజేపీ గెలిచి అధికారంలో కొనసాగుతోందని గుర్తు చేసారు. అదే స్ఫూర్తితో ఇక్కడ విజయాలు సొంతం చేసుకోవాలి. శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి. అసెంబ్లీ సమావేశాలను సభ్యులందరూ సీరియ్‌సగా నిర్వహిస్తున్నారు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సభ్యులు అంతా సభలోనే ఉండాలని స్పష్టం చేశారు.
కాగా, టీడీపీ ఎమ్మెల్యేలందరూ దాదాపుగా మంచి పనితీరు కనబరుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రాబు.. 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. వారి తీరు ఆశించిన స్థాయిలో లేదని.. ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడతానని చెప్పారు. గతంలోనూ దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఒన్ టు ఒన్ సమావేశం అయ్యారు. ఆ సందర్భంలోనూ వారికి స్పష్టమైన దిశా నిర్దేశం చేసారు. ఇక.. ఇప్పటికీ మార్పు రాకపోతే వారి విషయంలో పునరాలోచన తప్పదని తేల్చి చెప్పారు.
నియెజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉందండీ.. పార్టీ కోసం ఏం చేస్తున్నారు… కార్యకర్తలతో ఎలా ఉంటున్నారు వంటి అంశాల ఆధారంగా ఎమ్మెల్యేల తీరుపై అంచనాకు వస్తున్నారు. అదే విధంగా.. ఇక జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్‌తో ఉమ్మడి సమావేశం నిర్వహించామని.. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచుతామని సీఎం చెప్పారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తిస్తే ప్రాధాన్య వాటిని పూర్తి చేద్దామని చంద్రబాబు ప్రకటించారు.

