Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం...

ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు – నిర్ణయం వెనుక..!! | వివరాలు సమర్పించకపోవడంతో దాదాపు 5000 మంది ఉద్యోగులకు ఈ నెల జీతాలను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ప్రభుత్వం ఉద్యోగులు అందరూ తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోవాలని సూచిస్తూ వస్తోంది. దీనికి సంబంధించి అన్ని శాఖలకు ప్రత్యేకంగా సర్క్యులర్లు జారీ చేసారు. వివరాలు నమోదు చేయాలంటే జీతాలు నిలుపుదల అవసరం. అయినా, కొందరు ఉద్యోగులు తమ వివరాలు ఇవ్వకపోవటం తో వారి జీతాలను నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ జాబితాలో ఐఏఎస్ నుంచి జిల్లా స్థాయి ఉద్యోగుల వరకు ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారుతోంది. ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌(ఐఎఫ్‌ఎంఐఎస్‌)లో తమ వివరాలను మ్యాపింగ్‌ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సుమారు 5వేల మంది ప్రభుత్వోద్యోగుల మార్చి నెల జీతాలను ప్రభుత్వం నిలిపివేసింది. గత పది నెలలుగా ప్రభుత్వం పదేపదే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఈ చర్యలు చేపట్టారు. ఈ జాబితాలో కిందిస్థాయి ఉద్యోగులే కాకుండా ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారిలో పెద్దసంఖ్యలో బోగస్‌ ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనితో పనిచేయకుండానే జీతాలు పొందుతున్న ఉద్యోగుల ఏరివేత లక్ష్యంగా ప్రతి ఉద్యోగిని ట్రాక్ చేయడానికి డేటా మ్యాపింగ్‌ను తప్పనిసరి చేసింది. ఈ సాధారణ ఉద్యోగుల్లోనూ చాలా మంది తమ వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్‌లో నమోదు చేసుకోలేదు.

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల జీతాలు-దాదాపు-5000-ఉద్యోగులకు-సమర్పించని కారణంగా

చర్యల దిశగా ప్రభుత్వం కసరత్తు

ఈ వివరాల నమోదు కోసం ప్రభుత్వం పలు మార్లు సమాచారం ఇచ్చింది. నిర్దిష్ట సమాచారం అందించింది. వివరాలు ఇవ్వకపోతే జీతాలు నిలుపుదల హెచ్చరించింది. అయినా… ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఐడీ కార్డులో ఉన్న వివరాలకు, ఆధార్‌లో ఉన్న వివరాలకు పొంతన లేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగుల వేతనాలు నిలిచిపోయాయి. వెంటనే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో తన వివరాలను నమోదు చేసుకోగా, మిగిలిన ఉద్యోగులు కూడా ఇప్పుడు హుటాహుటిన డేటా మ్యాపింగ్‌ చేసే పనిలో పడ్డారు. పురపాలక శాఖలో పారిశుద్ధ్య కార్మికుల పేరుతోనూ, డ్రైవర్లుగా, మంత్రులు, అధికారుల ఇళ్లలో వంటవాళ్లుగా చూపే వారిలోనే ఎక్కువ మంది బోగస్‌ ఉద్యోగుల గుర్తింపు ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, ఉనికి లేని ఉద్యోగుల పేరుతో నిధులు డ్రా చేస్తున్న బోగస్‌ ఏజెన్సీల వ్యవహారంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కమిటీ ప్రస్తుత శాఖల వాగా సిబ్బంది సంఖ్యను సమీక్షిస్తోంది. ఉద్యోగుల వివరాలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసిన తర్వాత నిలిపివేసిన వేతనాలను విడుదల చేయాలని అధికారులు ఆదేశించారు. నిధులు మళ్లించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వ అడుగులు పడుతుండడంతో ఏజెన్సీల్లో కలవరం మొదలైంది. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారుతోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular