తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి జీహెచ్‌సీ అదిరిపోయే వార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ ఈ నెల 31 లోపు ఉంటే, దానిపై అదనంగా పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంటే మీరు కేవలం అసలు పన్నుతో పాటు, కేవలం 10 శాతం వడ్డీని చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి పన్ను వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు, పౌరులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలు తమ సౌకర్యార్థం కింది మార్గాల ద్వారా పన్ను చెల్లించాలని అధికారులు సూచించారు:
- ఆన్‌లైన్ ద్వారా: అధికారిక వెబ్‌సైట్ www.ghmc.gov.in సందర్శించి సులభంగా చెల్లించవచ్చు.
- యాప్ ద్వారా: మీ ఫోన్‌లోని ‘MY GHMC’ యాప్ ద్వారా క్షణాల్లో లావాదేవీ పూర్తి చేయవచ్చు.
- నేరుగా: మీసేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లు (CSC) లేదా జీహెచ్‌సీ రింగ్ కౌంటర్ల వద్ద నగదు/కార్డు ద్వారా చెల్లించవచ్చు.
నగరాభివృద్ధిలో భాగస్వాములు కండి!
“ప్రజలు ఈ పన్ను వినియోగించుకుని సకాలంలో పన్ను చెల్లించాలి. మీరు చెల్లించిన ఆధార మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల అభివృద్ధి మరియు పారిశుధ్య పనులకు ఉపయోగపడుతుంది. వడ్డీ రాయితీ పొంది నగరాభివృద్ధికి సహకరించండి” అని కమిషనర్.
గుర్తుంచుకోండి, ఈ 90% రాయితీ సదుపాయం కేవలం మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ పూర్తి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది, కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ బకాయిలను క్లియర్ చేసుకోండి.

