Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeఅంతర్జాతీయంఆలయ ప్రసాదాల కల్తీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆలయ ప్రసాదాల కల్తీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip

ఆలయ ప్రసాదాల కల్తీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

 

అమరావతి, ఫిబ్రవరి 06,(సీమకిరణం న్యూస్ ):

 

ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో కొందరు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచినట్టు ఆరోపించారు. శ్రీశైలం ప్రసాదంలో కూడా కల్తీ జరిగినట్టు తెలిపారు. తిరుమల లడ్డూలో బాత్‌రూమ్‌లు శుభ్రం చేసే కెమికల్స్‌ వాడినట్టుగా ఆరోపిస్తూ, ఈ విషయాలను తాను NDDB నివేదిక ఆధారంగానే చెబుతున్నానని స్పష్టం చేశారు. అదే సమయంలో సీబీఐ, సిట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టుగా కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. కానీ కల్తీ జరిగినట్టు సిట్‌ నివేదికలోనే ఉందని వైవీ సుబ్బారెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రసాదాల విషయంలో భక్తుల నమ్మకం దెబ్బతినకూడదని, నాణ్యతపై రాజీ పడబోమని సీఎం స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular