seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 6:03 am Digital Edition : SEEMA KIRANAM

ఆర్యవైశ్యుల ఐకమత్యంతో తిరువీధి రమేష్ శెట్టికి భారీ మెజారిటీ అందించండి

ఆర్యవైశ్యులంతా ఒక్కటై రమేష్ శెట్టిని గెలిపించండి

 

లుకలుకలు పక్కనపెట్టి ఐక్యంగా కదలండి.. రమేష్ శెట్టికి అండగా నిలవండి

 

ఆర్యవైశ్యుల ఐక్యతే రమేష్ శెట్టి విజయానికి బలం

 

ఆర్యవైశ్యులు ఐక్యంగా ప్రచారం చేయాలి – రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య 

 

రమేష్ శెట్టికి భారీ మెజారిటీ లక్ష్యం.. ఐకమత్యంతో ప్రచారంలోకి దిగిన ఆర్యవైశ్య ప్రముఖులు

 

కర్నూలు ప్రతినిధి, నవంబర్ 26 (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టికి ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంతో మద్దతుగా నిలిచి, అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య పిలుపునిచ్చారు. కుల సంఘంలో చిన్నచిన్న లుకలుకలు, మనస్పర్థలు ఉంటే వాటన్నింటినీ పక్కనపెట్టి, ఎన్నికల ప్రచారంలో ఆర్యవైశ్యులంతా ఒకే తాటిపైకి వచ్చి సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. తిరువీధి రమేష్ శెట్టికి మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొని ఆయన విజయానికి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘం ఐకమత్యమే బలమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు తిరువీధి వంశీధర్, మల్లికార్జున ఫర్నిచర్ యజమాని రాజా గోపాల్, తిరువీధి రాంప్రసాద్, తిరువీధి సుధీంద్ర, అమ్మవారిశాల గౌరవ అధ్యక్షుడు సముద్రాల శ్రీరాములు, ఒంగోలు సాయి తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.