భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. 19 రోజులకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య భీకర యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, గ్యాస్ రిఫైనరీ క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాలోని ఇంధన లక్ష్యాలే కేంద్రంగా దాడులకు తెగబడుతున్నాయి.
తమ ఎనర్జీ ప్రాథమికసదుపాయాలపై దాడి చేసి శత్రువు పెద్ద తప్పు చేసిందని తాజాగా ఇరాన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. పొరుగు దేశాల ఆయిల్ ఫెసిలిటీస్ పై దాడులు చేయడం మాకు ఏమాత్రం ఆలోచన లేదు.. అమెరికా, ఇజ్రాయెల్ మాపై దాడికి పాల్పడింది. ఇప్పుడు యుద్ధం మరోస్థాయికి చేరింది. గల్ఫ్ దేశాల ఎనర్జీ ఫెసిలిటీస్ పై దాడులను ప్రారంభించాం.. మరోసారి మాపై అటాక్ చేస్తే వాటిని పూర్తిగా నాశనం చేసింది ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
అయితే ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య భీకర యుద్ధంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాన్ని తక్షణమే ముగించాలని కోరింది. దౌత్య చర్చలతోనే శాంతి సాధ్యమైంది. ఈ మేరకు భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. దాడులు ఆమోదయోగ్యం కాదని వెంటనే ఇలాంటి నిలిపివేయాలని సూచించారు. ఇంధన వ్యవస్థలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు.
గత కొన్ని రోజులుగా గల్ఫ్ ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు సంబంధించి మీడియా ప్రశ్నలకు మా ప్రతిస్పందన ⬇️
🔗 https://t.co/sgSkthfInQ pic.twitter.com/rLtYKOHznu
– రణధీర్ జైస్వాల్ (@MEAIndia) మార్చి 19, 2026
ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీస్ పై జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రపంచ ఇంధన రంగాన్ని మరింత అస్థిరపరుస్తున్నాయని అన్నారు. ఈ మేరకు చమురు సంస్థలు, గ్యాస్ ప్లాంట్స్ పై దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ దాడుల కారణంగా ప్రపంచ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది.

మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధంపై ప్రధాని మోదీ.. ఒమన్ సుల్తాన్, మలేషియా ప్రధానితో ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ మేరకు తాజా పరిస్థితులపై మాట్లాడారు. ఈ విషయాలను ప్రధాని మోదీ తన ఎక్స్‌కౌంట్‌లో పోస్ట్ చేశారు. ఒమన్ పై దాడులను ఖండించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. చర్చల ద్వారానే పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.