వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, అనిశ్చితుల మధ్య బంగారం, వెండి ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), బులియన్ మార్కెట్ ధరల్లో భారీ కదలిక కనిపించింది. పసిడి ధరల పెరుగుదలకు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం అయ్యాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందనే వార్తలు పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి.
స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణం. ICEx లో ప్రారంభ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం 2.04 శాతం వృద్ధితో 1.60 లక్షల రూపాయలను దాటేసింది. 1,60,079 రూపాయలకు చేరింది. కిలో వెండి ఏకంగా ఆరు శాతం పెరిగింది. 2,68,093 రూపాయలుగా నమోదైంది. ముంబై స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రామాలకు 1,61,350కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 1,47,900 వద్ద లభించింది.

ఢిల్లీ, జైపూర్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,61,500 కాగా, 22 క్యారెట్లు రూ. 1,48,050. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,61,400, 22 క్యారెట్లు రూ. 1,47,950గా ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పుణె నగరాల్లో 24 క్యారెట్ల రకం రూ. 1,61,350, 22 క్యారెట్ల రూ.1,47,900గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,211, 22 క్యారెట్లు – రూ. 14,860, 18 క్యారెట్లు – రూ. 12,720
ముంబై..
24 క్యారెట్లు – రూ. 16,135, 22 క్యారెట్లు- రూ. 14,790, 18 క్యారెట్లు – రూ. 12,101
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 16,135, 22 క్యారెట్లు- రూ. 14,790, 18 క్యారెట్లు – రూ. 12,101
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 16,135, 22 క్యారెట్లు- రూ. 14,790, 18 క్యారెట్లు – రూ. 12,101
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 16,135, 22 క్యారెట్లు- రూ. 14,790, 18 క్యారెట్లు – రూ. 12,101
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 16,135, 22 క్యారెట్లు- రూ. 14,790, 18 క్యారెట్లు – రూ. 12,101