seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 1:10 pm Digital Edition : SEEMA KIRANAM

ఆకాశంలో మొదలైన ప్రేమ కథ. ఆయన్ని మైమరిపించిన సారా! | నెతన్యాహు వెనుక శక్తి: సారా నెతన్యాహు ఫ్లైట్ అటెండెంట్ నుండి ఇజ్రాయెల్ వరకు అత్యంత ప్రభావవంతమైన మహిళ ప్రయాణం

అంతర్జాతీయ

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ప్రపంచ రాజకీయ యవనికపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక తిరుగులేని యోధుడు. కానీ ఆ పవర్‌ఫుల్ లీడర్‌ను నడిపించే ఒక అదృశ్య శక్తి.. దేశ అధికారిక నిర్ణయాలను ప్రభావితం చేయగల ఒక ‘షాడో పవర్’ ఆమె! ఆకాశంలో ఎయిర్ హోస్టెస్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఇజ్రాయెల్ దేశపు ఫస్ట్ లేడీగా ఎదిగిన సారా నెతన్యాహు (సారా నెతన్యాహు) ప్రస్థానం ఒక సంచలనం. భారత ప్రధాని మోడీకి ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ఆత్మీయత ఒకవైపు.. అవినీతి ఆరోపణలు, క్రిమినల్ విచారణలతో అట్టుడుకుతున్న వివాదం.

ఒకవైపు సైకాలజిస్ట్ గా చిన్నారుల మనసులను చదివే సారా, మరోవైపు దేశ రాజకీయాలంటే తన కనుసన్నల్లోనే శాసిస్తోందన్న ఆరోపణలు ఆమె చుట్టూ ఉన్నాయి. ఇంతకీ ఎవరీ సారా నెతన్యాహు? ఆమె ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఎందుకు అంత పవర్ ఫుల్? నెతన్యాహు ఎందుకు ఆమెను ‘వీరవనిత’ అని కొనియాడుతారు?

ఫ్లైట్ అటెండెంట్ నుండి ఇజ్రాయెల్ వరకు నెతన్యాహు సారా నెతన్యాహు ప్రయాణం వెనుక ఉన్న శక్తి అత్యంత ప్రభావవంతమైన మహిళ

సారా నెతన్యాహు జీవితం ఒక సినిమా కథను తలపిస్తుంది. 1958లో ఒక విద్యావేత్త కూతురుగా జన్మించిన సారా, విద్యాభ్యాసం తర్వాత ఇజ్రాయెల్ జాతీయ విమానయాన సంస్థ ‘ఎల్ అల్’ (ఎల్ అల్) లో ఎయిర్ స్టీవార్డెస్‌గా పనిచేశారు. అక్కడే ఆమెకు బెంజమిన్ నెతన్యాహుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి 1991లో పెళ్లికి దారితీసింది. నెతన్యాహుకు ఇది మూడవ వివాహం.

సారా నెతన్యాహు వృత్తి సైకాలజిస్ట్.. ప్రవృత్తి పాలిటిషియన్!

సారా కేవలం గృహిణి మాత్రమే కాదు. ఆమె జెరూసలేం మున్సిపాలిటీలో బాలల మనస్తత్వవేత్తగా (చైల్డ్ సైకాలజిస్ట్) పనిచేస్తున్నారు. అయితే, వృత్తి సైకాలజిస్ట్ అయినా.. ఆమె ప్రవృత్తి మాత్రం రాజకీయాలే అని ఇజ్రాయెల్ మీడియా కోడై కూస్తుంది. ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా, నియామకాల్లోనూ, భర్త తీసుకునే రాజకీయ నిర్ణయాల్లోనూ ఆమె జోక్యం ఉంటుందనే ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి.

“నా భార్య.. నేను”: నెతన్యాహు వెనక అసలు శక్తి

నెతన్యాహు తన ప్రతి అధికారిక ప్రకటనలోనూ “నా భార్య, నేను” అనే పదాన్ని తరచుగా వాడుతుంటారు. ఇది ఇజ్రాయెల్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. విమర్శకులు ఆమెను రాజకీయ జోక్యదారు అని పిలిస్తే, నెతన్యాహు మాత్రం ఆమెను ఒక “వీరవనిత” అని, మీడియా తన భార్యను కావాలనే “బలిపశువు” చేస్తోందని వెనకేసుకొస్తారు.

వివాదాలు.. విచారణలు.. క్రిమినల్ కేసులు

సారా నెతన్యాహు పేరు వినగానే వివాదాలు కూడా వెన్నంటే వస్తాయి. అవినీతి, మోసం, నమ్మకద్రోహం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ప్రభుత్వ నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారనే కేసుల్లో ఆమె ఇప్పటికే విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా తన భర్తపై ఉన్న అవినీతి కేసులో సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు ఆమెపై క్రిమినల్ విచారణ కూడా ఉన్నారు.

ఇంకా..

  • కుటుంబ నేపథ్యం: ఆమె తండ్రి షుముయెల్ బెన్-ఆర్ట్జి ఒక ప్రసిద్ధ రచయిత, కవి. ఆమె సోదరులందరూ బైబిల్ క్విజ్ విజేతలు.
  • రెండవ వివాహం: నెతన్యాహు కంటే ముందు ఆమె ఒక కిబ్బుట్జ్ సభ్యుడిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు.
  • అంతర్జాతీయ గుర్తింపు: నెతన్యాహు చేసే ప్రతి విదేశీ పర్యటనలోనూ సారా ప్రముఖంగా కనిపిస్తారు, ఇది ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.

ఆంగ్ల సారాంశం

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారా నెతన్యాహు మనోహరమైన మరియు వివాదాస్పద జీవితాన్ని అన్వేషించండి. చైల్డ్ సైకాలజిస్ట్‌గా ఆమె కెరీర్ నుండి ఆమె న్యాయ పోరాటాలు మరియు రాజకీయ శక్తి వరకు.

Source link