seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 1:37 pm Digital Edition : SEEMA KIRANAM

ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.డి. యూనస్ అలీ

ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.డి. యూనస్ అలీ ఏకగ్రీవ నియామకం

 

కర్నూలు ప్రతినిధి, మే 17, (సీమకిరణం న్యూస్) :

ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం (APGOF) రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో చీఫ్ బయోకెమిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి. యూనస్ అలీ ను నామినేట్ చేసినట్లు ఫోరం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.డి. యూనస్ అలీ మాట్లాడుతూ గెజిటెడ్ అధికారుల సేవా సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం మరియు పరిపాలనా వ్యవహారాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నియామకం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఎం.డి.యూనస్ అలీ తన సేవా కాలంలో నిబద్ధత, పారదర్శకత మరియు సేవాభావంతో ప్రత్యేక గుర్తింపు పొందారని సభ్యులు కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం మరింత బలోపేతమై, గెజిటెడ్ అధికారుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన గెజిటెడ్ అధికారులు, సహచరులు మరియు మిత్రులు ఎం.డి. యూనస్ అలీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.