seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 6:43 am Digital Edition : SEEMA KIRANAM

అవినీతి రహిత పాలనే మా లక్ష్యం.. వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

అవినీతి రహిత పాలనే మా లక్ష్యం.. వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

 

 

సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బొమ్మన రవి రెడ్డి

 

 

వెల్దుర్తి నజీర్ , నవంబర్ 01, (సీమకిరణం న్యూస్):

 

 

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మన రవి రెడ్డి ప్రకటించారు. వెల్దుర్తిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రవి రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి రహిత పాలన అందించామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. వెల్దుర్తి మండలంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారానికి కృషి చేశానన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిష్కార చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్దుర్తి-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం వెల్దుర్తి గ్రామంలో తనకు ప్రజల మద్దతు ఉందని, యువత నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోందని రవి రెడ్డి పేర్కొన్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి, రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని ప్రజలు, నాయకులను కోరారు.