ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి భారీ శిల్పాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని నేడు చంద్రబాబు ఆవిష్కరించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి
పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు.

శాఖమూరు పార్కులో 6.80 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అమరజీవి త్యాగ శిల్పం పేరుతో రూపొందించిన ఈ విగ్రహాన్ని, అమరావతి ప్రాంతంలోని శాఖమూరు పార్కులో మొత్తం 6.80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
ప్రాజెక్ట్ లో తొలిదశ పనులు పూర్తి
ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ ను ఉపయోగించారు. కేవలం ఆరు కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఈ ప్రాజెక్టుకు తొలిదశ పనులను పూర్తి చేసి శిల్పాన్ని ఆవిష్కరించారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసిన తొలి భారీ శిల్పంగా ఈ విగ్రహం ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది.
చారిత్రక స్మారకంగా అమరజీవి విగ్రహం
ఈ ప్రాజెక్టు రెండవ దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుని చారిత్రక స్మారకంగా ఈ విగ్రహం నిలవనుంది. అమరావతి కేంద్రంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాడు ఆంద్ర రాష్ట్రం కోసం కృషి చేసిన మహనీయుడికి సరైన గుర్తింపును ఇచ్చారు.

