seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 6:46 am Digital Edition : SEEMA KIRANAM

అభివృద్ధి రుషి.. ప్రజల మనిషి సీఎం చంద్రబాబు..

💥76లోనూ అదే జోష్‌తో ముందుకు సాగుతున్న చంద్రబాబు!”

 

@-“పట్టుదలతో పర్వతాలు కదిలించిన నాయకుడు…

 

@-“విద్యార్థి నాయకుడి నుంచి విజనరీ సీఎంగా… నాలుగు దశాబ్దాల ప్రస్థానం స్ఫూర్తిదాయక గాథ”

 

@-“సంకల్పం ఉంటే సాధ్యం… రాజకీయాల్లో చిరస్థాయి ముద్ర వేసిన చంద్రబాబు”

 

@-“హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ మ్యాప్‌పై నిలిపిన విజనరీ లీడర్”

 

@-“సైబరాబాద్ నుంచి ఈ-గవర్నెన్స్ వరకు సంస్కరణల ప్రవాహం”

 

@-“విజన్ 2020తో భవిష్యత్తును ముందుగానే చూసిన నాయకుడు”

 

@-“అమరావతి కల… అభివృద్ధి దిశగా నిరంతర ప్రయాణం”

 

@-“సైబర్ బాబు… టెక్నాలజీతో పాలనకు కొత్త దిశ”

 

@-“ఒడిదొడుకులు ఎదురైనా నిలకడగా నిలిచిన రాజకీయ దురంధరుడు”

 

@-“76లోనూ యూత్‌కు పోటీగా పనిచేసే క్రమశిక్షణ”

 

@-“ప్రజల మనిషి… అభివృద్ధే ధ్యేయంగా నడిచే నాయకత్వం”

 

@-పట్టుదల, సంకల్పం, ప్రయత్నం, విజయం.. కలిస్తే.. చంద్రబాబు..!

 

@-భావితరాల భవిష్యత్తు చంద్రబాబే..!

 

@-రాజకీయ దురంధరుడు.!*

 

@- సంస్కరణలు, సాంకేతికత, స్థితప్రజ్ఞత కలబోసిన సుదీర్ఘ ప్రస్థానం

 

@-అభివృద్ధి రుషి.. ప్రజల మనిషి సీఎం చంద్రబాబు..

 

అమరావతి/ “సీమ కిరణం న్యూస్” ప్రత్యేక కథనం:

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన దార్శనికుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది విజన్, నిరంతర శ్రమ, నూతన ఆలోచనలు, ప్రజాపక్ష నాయకత్వం. ఇటువంటి గొప్ప నాయకుడి 76వ జన్మదినాన్ని జరుపుకోవడం మనందరికీ గర్వకారణం మాత్రమే కాకుండా, ఒక ప్రేరణగానూ నిలుస్తుంది… 1970వ దశకంలో యూత్ కాంగ్రెస్‌లో విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత చంద్రబాబు అంచెలంచెలుగా ఎదుగుతూ పలుమార్లు సీఎం పదవిని చేపట్టారు. సీఎం పోస్టు దాకా ఆయన అంత ఈజీగా చేరలేదు. దాని వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, సహనం దాగి ఉన్నాయి. ఆయన బర్త్‌డే సందర్భంగా “సీమకిరణం న్యూస్”  తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనమిది. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారావారిపల్లెలో నారా ఖర్జూర నాయుడు, శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. ఆరేళ్ల వయసులో తమ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాపురం గ్రామానికి నడిచి వెళ్లి చంద్రబాబు ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చంద్రగిరిలోని ప్రభుత్వ స్కూల్లో చదివారు. పదోతరగతి టీపీఎం హైస్కూలులో చదువుకున్నారు. ఆ రోజుల్లోనే తన సొంత ఊరులో వినాయక సంఘాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గ్రామాభివృద్ధి చేసే వారట. చంద్రబాబు తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు. చంద్రబాబు 1974లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. మొదట చంద్రగిరి యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు. చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాక.. 1980లో చంద్రబాబుకు మంత్రి పదవి దక్కింది. రాజకీయం.. అదో అతిపెద్ద మహాసముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం.. రాజకీయాల్లో అధికారం, రెండూ ఒక్కటే. అందలమెక్కించేదీ ప్రజలే, అధఃపాతాళానికి తొక్కేసేదీ వారే. అలాంటి రాజకీయాల్లోకి ఎంతో మంది నేతలు వస్తుంటారు.. పోతుంటారు. కానీ చరిత్రలో నిలిచిపోయేలా, చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకునే నేతలు కొందరే ఉంటారు.. అలాంటి వారిలో ఒకరు నారా చంద్రబాబు నాయుడు. తెలుగు రాజకీయాలను చంద్రబాబును వేర్వేరుగా చూడలేం. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎదుర్కొన్నన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్న లీడర్ మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు పేరు లేకుండా తెలుగు రాజకీయాలు, తెలుగు దినపత్రికలు ఉండని రోజులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందుకే గడిచిన 45 ఏళ్ల భారత రాజకీయాల్లో సీబీఎన్ ఓ దిగ్గజం. చంద్రబాబు విజన్‌ మీద ప్రశంసలతో పాటుగా విమర్శలు కూడా ఉంటాయి. భవిష్యత్తు గురించి మాట్లాడటం పక్కనపెట్టి.. వర్తమానంపై దృష్టిపెట్టమని ఆయన దార్శనికతపై ఎత్తిపొడుపులు కూడా ఉంటాయి. అయితే ఓ లీడర్‌గా వర్తమానంపైనే కాకుండా పాతికేళ్ల అనంతరం ఉండే పరిస్థితులపైనా ఆలోచనలు చేయగలిగే నేత చంద్రబాబు. 1990 వెనకటి రోజుల్లో చంద్రబాబు తెచ్చిన విజన్ 2020 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పారశ్రామిక అభివృద్ధికి దోహదపడింది. టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. సైబరాబాద్ సృష్టి, హైటెక్ సిటీ నిర్మాణం, పాలనలో ఈ- గవర్నెన్స్, మహిళల కోసం స్వయం సహాయక సంఘాలు ఇలాంటి ఎన్నో సంస్కరణలు తెచ్చారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు పాలన అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఐటీ, సేవల రంగ కేంద్రంగా తీర్చిదిద్దడం. ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యతనిచ్చారు. 1998లో హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీలను ప్రారంభించి, హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ఏర్పాటుతో నగరానికి ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రపంచ నేతలతో సమావేశమై హైదరాబాద్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం ప్రపంచ బ్యాంకు నుంచి నేరుగా రుణం పొందిన తొలి భారత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపారు. ఆయన దార్శనికతకు గుర్తింపుగా టైమ్ మ్యాగజైన్ (1999) “సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్”గా, ఇండియా టుడే పోల్‌లో “ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం”గా ఎంపికయ్యారు. 2014-19 మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించే బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. ఈ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. చంద్రబాబు నాయుడు తన సమకాలీన రాజకీయ నాయకులకు భిన్నంగా, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. ఆయనను ‘సైబర్ బాబు’గా పిలవడం పరిపాటి. పార్టీ కార్యకలాపాలను కంప్యూటరీకరించడం వంటివి ఆయన ముందుచూపునకు నిదర్శనం. 76 ఏళ్ల వయసులోనూ యువ నాయకులకు దీటుగా పనిచేస్తారని, అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తారని పేరుంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తన ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకోవడం, అభివృద్ధి ద్వారా ప్రజలకు సంపద సృష్టించి, ప్రయోజనాలు అందరికీ చేరేలా చూడాలనే తపన ఆయనను దశాబ్దాలుగా ప్రజా జీవితంలో నిలబెట్టాయి.

 

*@-అభివృద్ధి రుషి.. ప్రజల మనిషి సీఎం చంద్రబాబు.. ఆయన ప్రజా జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు*

 

క్రమశిక్షణ, దూరదృష్టి, వ్యూహ చాతుర్యంతోడు నిత్యం ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన దార్శనికుడిగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1950, ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు జన్మించారు. చంద్రబాబు తండ్రి కర్జూరనాయుడు గ్రామ పెద్దల్లో ఒకరు. నాన్న ప్రభావంతో చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు అబ్బాయి. స్కూల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవారు. చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయిన చంద్రబాబు.. క్యాంపస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆర్థికశాస్త్రంలో పీజీ చేశాక, అదే యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉంటూనే చంద్రబాబు రాజకీయాలవైపు అడుగులు వేశారు. తొలిసారిగా 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తద్వారా 28ఏళ్ల వయసులోనే యువ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో చంద్రబాబు కాలు మోపారు. 1980-1983 మధ్య కాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, చిన్ననీటి పారుదల తదితర శాఖలకు మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలోనే తన అభిమాన హీరో నందమూరి తారకరామారావును చంద్రబాబు తొలిసారి కలుసుకున్నారు. చంద్రబాబు క్రమశిక్షణ, వ్యక్తిత్వం ఎన్టీఆర్‌కు నచ్చడంతో 1981లో తన కూతురు భువనేశ్వరితో పెళ్లి జరిపించారు. ఆ తరువాత 1982లో కాంగ్రెస్ నుంచి మరోసారి పోటీ చేసిన చంద్రబాబు ఓటమిపాలయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ టికెట్‌పై 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేశారు. అప్పట్నుంచీ ఆ నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోటగా మారింది. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. తొలి టర్మ్ లోనే ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, పచ్చదనం – పరిశుభ్రత వంటి అనేక వినూత్న కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా రాత్రిపూట రోడ్లను శుభ్రం చేయించడం మొదలు పెట్టారు. గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాలు పేద మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పులు తెచ్చాయి. శాసనసభ సమావేశాలను ప్రజలు తిలకించాలనే ఉద్దేశంతో పాతికేళ్ల క్రితమే ప్రత్యక్ష ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. అలా, ‘లైవ్‌’లో అందించిన మొదటి రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సృష్టించింది. చంద్రబాబు అమల్లోకి తెచ్చిన ‘డయల్‌ యువర్‌ సీఎం’ ప్రోగ్రామ్‌ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగే ఇబ్బంది నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే క్రమంలో 46 రకాల సేవలను ఒకేచోట అందించే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఈ-సేవను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ‘విజన్‌ 2020’తో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దారు. ఐఎస్‌బీ, ఐఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ ను ఒప్పించి అమెరికా వెలుపల తొలి మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంను హైదరాబాద్ లో ఏర్పాటు చేయించిన ఘనత చంద్రబాబుది. 2003లో తిరుమల బ్రహ్మోత్సవాలవేళ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా, అలిపిరి వద్ద మందుపాతరల పేలుళ్లలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ఆయనకు అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం హయాంలో తొమ్మిదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చింది చంద్రబాబు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి.. అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు చంద్రబాబు కృషి చేశారు. అయితే, 2019లో ఓడిపోయి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన చంద్రబాబు.. మళ్లీ 2024 ఎన్నికల్లో నాల్గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమరావతి రాజధానిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు.. ఏపీని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, సంస్కరణవాదిగా, దార్శనికుడిగా తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ అభివృద్ధి నమూనా దేశంలోని అనేక నగరాలకు ఆదర్శంగా నిలిచింది. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా, మొక్కవోని దీక్ష, పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా కొనసాగుతున్నారు. 76వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో, ఆయన సుదీర్ఘ ప్రస్థానం, అభివృద్ధి పట్ల నిబద్ధత ఎందరికో స్ఫూర్తిదాయకం.