అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->సింధూ జలాల ఒప్పందంపై పాకిస్థాన్ కు భారత్ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేంత వరకూ ఆ దేశంపై సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి హరీష్ తెలియజేశారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా పాకిస్థాన్ మారిందని అన్నారు. జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాదులలో 26 మంది భారతీయులు మరణించిన నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న ఈ ఒప్పందాన్ని ఇకపై భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించినంత కాలం పాకిస్థాన్ పై విధించిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎన్ లో భారత్ శాశ్వత అధికార ప్రతినిధి హరీష్ తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘జల్ జీవన్ మిషన్’ ద్వారా ప్రజలందరికీ భద్రత కల్పించడంలో భారత్ పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
అలాగే ప్రస్తుతం మారుతున్న సాంకేతికత, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేద్దామని భారత్ చేసిన ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించినట్లు హరీష్. ప్రపంచానికి కీలకమైన ఉగ్రవాద కేంద్రంగా మారిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. 1960లో భారత్ సింధూ జలాల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని.. కానీ కాలానుగుణంగా పాకిస్థాన్ యుద్ధాలు, ఉగ్రదాడుల ద్వారా ఆ నమ్మకాన్ని కోల్పోయిందని హరీష్ ప్రకటించారు.
ఇక ఏప్రిల్ 22 న పహల్గామ్ లో పాకిస్థాన్ కు చెందిన నలుగురు ఉగ్రమూకలు జరిపిన దాడుల్లో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి అయితే ఈ దాడికి దారితీసింది 7 పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో మే-10 మధ్య పాకిస్థాన్‌లోని 9 కీలకమైన స్థావరాలపై భారత్ దాడులకు పాల్పడింది. వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.

పాకిస్థాన్ లో ధ్వంసం అయిన స్థావరాల్లో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, సుజ్ మార్క టైబా క్యాంప్ లు ఉన్నాయి.