seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 5:44 am Digital Edition : SEEMA KIRANAM

అన్యాయం చేశారు..సెల్ఫీ వీడియో చేసి బీఆర్ఎస్ మహిళా అభ్యర్థి ఆత్మహత్య యత్నం | ఎన్నికల కౌంటింగ్ అవకతవకలపై brs అభ్యర్థి ఆత్మహత్యాయత్నం, బ్యాలెట్ పేపర్లపై ఎన్నికల సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇంకా ఎన్నికల వేడి చల్లారలేదు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఛైర్మన్‌లను ఎంపిక చేసే ఎంపికలో గెలిచిన పార్టీలు మునిగిపోయాయి. ఈ క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఓట్ల లెక్కింపులో తనకు అన్యాయం జరిగింది కొత్తగూడెం కార్పొరేషన్ లోని 54 డివిజన్ బీఎస్‌ఎస్ అభ్యర్థిని మాదా పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు.

తన బ్యాలెట్ పేపర్లను దాచిన సిబ్బంది

మొన్న శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తనకు అన్యాయం చేసింది. తనకు చెందిన 100 బ్యాలెట్ పేపర్లను సిబ్బంది ప్యాంటు జేబులో దాచుకున్నారు. ఒక ఉద్యోగి కి ఫోన్ కాల్ రాగా బయటకు వెళ్లి బ్యాలెట్ కట్టను దాచాడని ఆమె చెప్పింది.

బ్యాలెట్ పేపర్లపై ఎన్నికల సిబ్బందిపై ఎన్నికల కౌంటింగ్ అవకతవకలపై brs అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ యత్నం

మార్లు కోరిన బ్యాలెట్ కట్టలు డబ్బాలో వేయకుండా సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బలవంతంగా తనతో సంతకాలు తీసుకున్నారని మాదాసు పద్మ పేర్కొన్నారు.ఈ అక్రమాల పైన తాను లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. దీంతో తన తీవ్ర మనస్తాపం చెందిన ఆమె కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

తనకు న్యాయం జరగకుంటే ఎక్కడికైనా వెళ్తా అంటున్న మాదాసు పద్మ

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో త్వరగా వైరల్ కాగా, హుటాహుటిన ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. ఈ ఘటనపై భద్రాద్రి కలెక్టర్‌కు శనివారం ఫిర్యాదు చేయడానికి వెళ్లినందున ఆయన అందుబాటులో లేకపోవడంతో మాదాసు పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని, ఎక్కడి వరకైనా వెళతానని ఆమె తేల్చి చెప్పింది.

కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ పీఠం సీపీఐ.. కాంగ్రెస్ పొత్తులతో

ఈ వ్యవహారంపై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కొత్త గూడెం కార్పొరేషన్ లో హంగు ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ సీపీఐ మధ్య చర్చలు జరిగాయి కాంగ్రెస్ సీపీఐ పొత్తుతో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థికి మేయర్ పదవి ఇచ్చేందుకు అంగీకరించింది. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ కు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఆంగ్ల సారాంశం

ఎన్నికల కౌంటింగ్ అవకతవకలపై సెల్ఫీ వీడియోతో brs అభ్యర్థి ఆత్మహత్యాయత్నం. ఎన్నికల సిబ్బంది జేబులో బ్యాలెట్ పేపర్లు పెట్టుకుని తనకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు.

Source link