భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల అరవ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాట అధికారాన్ని నిలుపుకునేందుకు డీఎంకే- కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది. తిరిగి అధికారం పొందేందుకు ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్.. విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తమిళనాడులో ఈసారి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ చుట్టూనే ప్రస్తుతం తమిళ రాజకీయాలు తిరుగుతున్నాయి. తొలిసారిగా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరూర్ తొక్కిసలాట దగ్గరినుంచి రజనీకాంత్ ఎపిసోడ్ వరకూ విజయ్ వెంట వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వేడుకలో విజయ్ ఉంటుంది.
రంజాన్ సందర్భంగా తమిళనాడులోని మహాబలిపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి అన్ని మతాలు సమానం అని.. అన్ని మతాల విశ్వాసాలను కాపాడటంలో టీవీకే పార్టీ కాంప్రమైజ్ అవ్వదని చెప్పారు. తమిళనాడులో ఒంటరిగా పోటీ జరిగింది. ఎన్డీయే కూటమిలోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
తాము ఎవరి టీం కాదని.. ప్రజల టీం అని విజయ్ చెప్పారు. టీవీకే లీడర్ షిప్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఉంటుందని విజయ్ క్లారిటీ ఇచ్చారు. సామాజిక న్యాయం, సెక్యూలరిజంపై కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని విజయ్ తేల్చి చెప్పారు. రకరకాలుగా తమను అణచివేయాలని కొన్ని శక్తులు ప్లాన్ చేస్తున్నాయని.. అది సాధ్యం కాకపోవడంతో తమపై ఫేక్ ప్రచారం చేశారని విజయ్ చెప్పారు.

ప్రజా ప్రభుత్వాన్ని త్వరలోనే అమలు చేయడం అందులో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు పొత్తుపై మరోసారి విజయ్ క్లారిటీ ఇచ్చారు. సింగిల్ గానే పోటీ వారికి డీఎంకే, ఏఏడీఎంకే పార్టీలతో పొత్తు లేదని తేల్చారు. దేవుడి దయతో అనుకున్న టార్గెట్ ను సాధిస్తామని అన్నారు.

