seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 1:31 pm Digital Edition : SEEMA KIRANAM

అక్క పార్టీ పెడితే బ్యాలెట్ బాక్సులు బద్దలే : సోషల్ మీడియాలో కవితక్క రచ్చ | వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుపుపై ​​కవితపై సోషల్ మీడియాలో పోస్టులు, ఆమె రాజకీయ పార్టీకి ప్రచారం

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర తర్వాత కవిత రాజకీయ చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా కవిత రాజకీయం పైన మరోసారి చర్చలు వేడెక్కాయి. “అక్క పార్టీ పెడితే బ్యాలెట్ బాక్సులు బద్దలవుతాయి” అంటూ కల్వకుంట కవితను ఉద్దేశించి కవిత అభిమానుల పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్ వంటి వేదికల్లో వైరల్ అవుతున్నాయి.

కవిత పై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కవిత పలికిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లి మున్సిపాలిటీపైనకేతనం ఎగురవేయడంతో ఈ క్రెడిట్ ను కవిత ఖాతాలో ఆమె అభిమానులు వేశారు. “ఓటెయ్యండి అని మాత్రమే చెప్పినా ఇన్ని సీట్లు గెలిచాం. ఒకవేళ స్వయంగా పార్టీ పెట్టి ప్రచారం చేస్తూ ఓటు వేయండి అంటే బ్యాలెట్ బాక్సులు బద్దలవుతాయి” అనే వాక్యాలతో అభిమానులు ఆమెకు మద్దతు ఇస్తున్నారు.

వడ్డేపల్లి మున్సిపాలిటీ విజయంపై కవితపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు ఆమె రాజకీయ పార్టీపై ప్రచారం

అందరి దృష్టి కవిత పైనే

ఈ పోస్టులు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీశాయి. కవిత మద్దతు పలికిన చోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు 10 వార్డులలో ఎనిమిది చోట ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించగా కేవలం ఒకచోట బిఆర్ ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలవడం ఒకసారిగా అందరి దృష్టి కవిత పైన మళ్లేలా చేసింది.

సోషల్ మీడియాలో కవిత పార్టీ పెడితే ఎలా ఉంటుందో చర్చ

పార్టీ పెట్టకముందు మద్దతు ఇస్తేనే ఒక మున్సిపాలిటీ ని కైవసం చేసుకుంటామంటే, అక్క పార్టీ పెడితే బ్యాక్సులు బద్దలవ ని,ఇటీవల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చగా మారాయి. కవిత రాజకీయ ప్రస్థానం, ప్రజాక్షేత్రంలోకి కవిత వెళుతున్న విధానం, రాజకీయాల పైన కవితకు ఉన్న ఖచ్చితమైన అభిప్రాయం వెరసి ఆమె పరిపూర్ణమైన రాజకీయ అవగాహనతో ముందుకు వెళుతున్నారు అన్న చర్చ జరుగుతుంది.

ఇదంతా కవితపై ప్రజల అభిమానం అంటున్న అనుచరులు

అయితే ప్రత్యర్థి వారి ఈ పోస్టులను రాజకీయ ప్రచారంలో అభివర్ణిస్తుండగా, ఆమె అనుచరులు మాత్రం ఇది ప్రజల అభిమానం మాత్రమే అని చెబుతున్నారు. మొత్తానికి, అక్క పార్టీ పెడితే బ్యాలెట్ బాక్సులు బద్దలే” అంటూ పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది.

ఆంగ్ల సారాంశం

ఆమె కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, ఓట్లతో బ్యాలెట్ బాక్సులు పొంగిపోతాయని కవితను ప్రశంసిస్తూ వైరల్ పోస్ట్‌లతో సోషల్ మీడియా సందడి చేసింది. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో సరికొత్త రాజకీయ చర్చలకు దారితీశాయి.

Source link