ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ అందించింది. గత ఏడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్‌తో పాటు గుంటూరు కోర్టు తీర్పు వెలువరించింది. రూ పది వేలు, రెండు పూచీ కత్తు పై న్యాయస్థానం బెయిల్ అందించింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులు కస్టడీ పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో, అంబటి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిలీఫ్ దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యకర పదజాలంతో దూషించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబుకు కోర్టు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్‌ను అందించింది. ఈ కేసులో రాంపాడును నల్లపాడు పోలీసులు ఇటీవల అరెస్టు చేసి మేజిస్ట్రేట్ మేరకు రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. బెయిల్ కోసం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో రాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అంబటికి షరతులతో కూడిన బెయిల్‌ను ప్రదర్శించడం ద్వారా సోమవారం తీర్పు చెప్పారు. మరోసారి ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడలేదని, కేసును ప్రభావితం చేస్తే బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడలేదని రాంబాబుకు షరతు విధించారు. కేసులో చార్జిషీటు దాఖలు చేసే వరకు, లేదా రెండు నెలల పాటు ప్రతి రెండు శనివారాలకు పోలీస్ స్టేషన్‌కు ఒకసారి హాజరై సంతకాలు చేయాలన్నారు. రూ.పదివేలతో ఇరువురు పూచీకత్తులు సమర్పించాలని సూచించారు.

దౌర్జన్యాలు,దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు !
— Ambati Rambabu (@AmbatiRambabu) February 11, 2026
ఈ రోజు లేదా రేపు విడుదలకు ఛాన్స్
కాగా, చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ వచ్చినా.. గతంలో పోలీసులను బెదిరించిన కేసులో అంబటికి మరో కోర్టు 20 వరకు రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ నవంబరు 12న అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా పోలీసుల సూచనలను రాంబాబు బేఖాతరు చేసి, అడ్డంగా పెట్టిన బారికేడ్లను లాగిపడేసారు. అభ్యంతరం చెప్పిన పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లును, సిబ్బందిని బెదిరించి, వారిని నెట్టుకుంటూ బ్రిడ్జి పైకి ర్యాలీగా వెళ్లారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు పీటీ వారంట్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి గుంటూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరు పరచగా ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. కాగా, ఇప్పుడు పోలీసు కస్టడీ తిరస్కరించిన కోర్టు.. రాంబాబుకు బెయిల్ ఇచ్చింది. ఎటువంటి ఆటంకాలు లేకుంటే ఆయన ఈ సాయంత్రం లేదా రేపు (గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా.. కోర్టు బెయిల్ ట్వీట్ చేయటం పైన అంబటి రాంబాబు ఎక్స్ ఖాతా నుంచి చేసారు. అందులో దౌర్జన్యాలు,దాదులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు .. అంటూ పేర్కొన్నారు.
ఆంగ్ల సారాంశం
మెడికల్ కాలేజీ నిరసన ర్యాలీ కేసులో అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో బెయిల్ వచ్చింది, పోలీసు కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది