seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 7:54 am Digital Edition : SEEMA KIRANAM

అంబటి రాంబాబుకు బెయిల్ | గుంటూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది.

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు కొద్దిసేపటి కిందటే బెయిల్ ఇచ్చింది. అంబటి రాంబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు సెషన్స్ న్యాయస్థానం జడ్జి కొట్టివేశారు. దీన్ని తోసిపుచ్చారు. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత ఆయనకు బెయిల్ జారీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహించిన ఆరోపణలతో అంబటి రాంబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి సంబరాల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆయనపై కేసు నమోదైంది.

గుంటూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది.

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే విచారణ నిమిత్తం గుంటూరు న్యాయస్థానానికి సూచన. ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై విచారణ ప్రారంభమైంది గుంటూరు కోర్టు. ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించిన తర్వాత విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మళ్లీ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపింది.

లక్కీ డ్రా కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉందని, ఈ దశలో అంబటి రాంబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల తన పలుకుబడిని ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేయవచ్చని పోలీసుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కస్టడీకి ఇవ్వాలంటూ ఇచ్చిన పిటీషన్ ను కొట్టివేశారు. అంబటికి బెయిల్ ఇచ్చారు.

ఆంగ్ల సారాంశం

గుంటూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది.

Source link