అన్ని పార్టీలకు ఆత్మీయుడు.. అందరి చూపు విలేఖరి గౌస్ వైపు!
జర్నలిజం నుంచి ప్రజాసేవ వైపు అడుగులు.. గోనెగండ్ల ఎంపీటీసీ బరిలోకి గౌస్..?
గోనెగండ్ల, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):
గోనెగండ్ల మండల రాజకీయాల్లో విలేఖరి గౌస్ పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలను వార్తల రూపంలో వెలుగులోకి తీసుకువస్తూ, అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న గౌస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జర్నలిస్టుగా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న గౌస్, ప్రజాసేవను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో గోనెగండ్ల మండల కేంద్రంలోని 4, 5వ ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంపీటీసీ బరిలో గౌస్…?
ప్రజలతో ఉన్న పరిచయాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఆయనకు కలిసివస్తాయా? రిజర్వేషన్లు, అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చిన తర్వాత గౌస్ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? అన్నది స్థానికంగా ఆసక్తికరంగా మారింది. జర్నలిజం నుంచి ప్రత్యక్ష ప్రజాసేవ వైపు గౌస్ అడుగులు వేస్తారా? రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రయాణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.