seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 3:53 am Digital Edition : SEEMA KIRANAM

అంగరంగ వైభవంగా బ్రహ్మగుండేశ్వరుని రథోత్సవం

శ్రీ బ్రహ్మగుండం క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ బ్రహ్మగుండేశ్వరుని రథోత్సవం

కనుల పండుగగా అశేష జనవాహినితో బ్రహ్మగుండేశ్వర రథోత్సవం

వెల్దుర్తి , ఫిబ్రవరి 18, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సమీపంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మగుండం నందు కామేశ్వరి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడోరోజు స్వామివారి రథోత్సవంను అశేష జనవాహిని తో ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన తదుపరి స్వామివారిని అలంకరించిన రథంపై ప్రతిష్టించి ఊరేగింపుగా కొనసాగించి శోభాయమానంగా అలంకరించిన రథాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో హర హర శంభో శంకర అనే నామస్మరణతో రథాన్ని లాగుతూ హర్షద్వనాలు చేశారు. జిల్లా నలుమూలలతోపాటు పక్క జిల్లాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి వారి సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు వెల్దుర్తి నుండి బ్రహ్మగుండం వరకు దాతల సహకారంతో ఉచిత బస్సులను నిర్వహించారు. ఎటువంటి అవాంచిత సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ బందోబస్తుతో సిఐ యుగంధర్ మరియు ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొమ్మనా దశదరామిరెడ్డి మరియు ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్, బలరాం గౌడ్. రమాకాంత్ రెడ్డి.సుధాకర్ గౌడ్.ఎల్లయ్య ఆచారి.మరియు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు బొమ్మనా రాజశేఖర్ రెడ్డి, హనుమంతరావు,ఈవో ఆంజనేయులు, సిఐ యుగంధర్, ఎస్సై ఎం నరేష్, పంచాయతీ సెక్రెటరీ కె. లక్ష్మీనాథ్, వైద్య సిబ్బంది, పంచాయతీ బోర్డ్ సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.